Tuesday, May 14, 2024
- Advertisement -

ఫిదా మూవీ రివ్యూ

- Advertisement -

శేఖర్ కమ్ముల మూవీ అంటే.. టాలీవుడ్ లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయిత గత రెండు సినిమాల నుంచి ప్రేక్షకులని ఆకట్టుకోవడంలో ఆయన వెనక పడ్డారు. అయితే ఈ సారి హిట్ కొట్టాలని.. మెగా హీరో వరుణ్ తో దిల్ రాజు బ్యానర్ లో శేఖర్ చేసిన సినిమా ఫిదా.. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం..

కథ :

అమెరికాలో ఉన్న “వరుణ్ (వరుణ్ తేజ్)” ను పరిచయం చేస్తూ ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. అతని అన్నకు పెళ్లి సంబంధం చూడాలని ఇద్దరు కలిసి ఇండియా కి వస్తారు. ఈ క్రమంలో తెలంగాణ అమ్మాయి “భానుమతి” ని కలుస్తాడు. భానుమతి అక్కతో వరుణ్ అన్న పెళ్లి నిశ్చయమవుతుంది. వరుణ్ తో ప్రేమలో పడుతుంది భానుమతి. ఇంతలో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోతారు. వరుణ్ తన తప్పుని అర్ధం చేసుకొని భానుమతి ని కలుద్దామని వస్తాడు. ఇంతలో భానుమతిని తన తండ్రి అమెరికా తీసుకెళ్తాడు. హర్షవర్ధన్ తో పెళ్లి నిశ్చయిస్తారు. భానుమతి వరుణ్ ప్రేమను అర్ధం చేసుకుంటుందా? వారి ఇద్దరి పెళ్లి జరుగుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలి అంటే “ఫిదా” సినిమా చూడాల్సిందే. దిల్ రాజు ప్రొడక్షన్ వ్యాల్యూస్ సినిమాలో ఆద్యంతం కనిపిస్తాయి. ఇక దర్శకుడుగా శేఖర్ కమ్ముల ఇది వరకు సినిమాలతో పోల్చుకుంటే ఫిదా కాస్తా ప్రత్యేకం అనే చెప్పాలి. అతని స్టైల్ అఫ్ మేకింగ్ చూపిస్తూ, డైలాగ్స్, ఎమోషన్స్ ని చూపించడంలో తన మార్క్ మరల రిపీట్ చేసాడు అనిపిస్తుంది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ శక్తి కాంత్ అందించిన పాటలు చాలా కాలం పాటు జనాల నోట్లో నానుతూనే ఉంటాయి.

ప్లస్ పాయింట్స్ :

ఇక ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ విషయంకు వస్తే.. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది హీరోయిన్ సాయి పల్లవి గురించి.. ఈమె తన పెర్ఫార్మెన్స్ తో థియేటర్ లో అందరిని కట్టిపడేసింది. చిన్న ఎమోషన్స్ లో కూడా అదరగొట్టింది. కుటుంబం ,ప్రేమ అనే బంధాల మధ్య నలిగిపోయే అమ్మాయి పాత్రలో సాయి పల్లవి అద్భుతంగా చేసింది. తెలంగాణా యాసలో ఆమె సంభాషణలు, అలానే కామెడీ టైమింగ్ బాగుంది. డాన్స్ విషయంలో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇలా అన్నిట్లో అదరగొట్టి.. సినిమా రెంజ్ ని పెంచింది. ఇక సినిమా ఆద్యంతం ప్రేక్షకులని అలా ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలోకి తీసుకెళ్ళిపోతుంది. అచ్చం మన ఇంట్లో, మన ఊరిలో ఉన్న ఫీలింగ్ ని ఫస్ట్ ఆఫ్ అంతా ఉంటుంది. ఇక వరణ్ తేజ ఇప్పటికే తన సినిమాలతో అతని పెర్ఫార్మెన్స్ ఎంత బాగుంటుందో చూపించాడు. ఆలానే ఈ సినిమాలో అంతకు మించి నటనతో అదరగొట్టాడు. ఇక హీరోయిన్ తండ్రిగా నటించిన సీనియర్ నటుడు సాయిచంద్ కూడా తన నటనతో ఆకట్టుకున్నాడు. అలానే మిగిలిన నటినటులు కూడా పర్వాలేదనిపించారు.

మైనస్ పాయింట్స్ :

ఇక మైనస్ పాయింట్స్ విషయంకు వస్తే.. సినిమాలో కథ లేకపోవడం.. శేఖర్ సినిమాలు అంటే కథనం అద్భుతంగా ఉంటుంది.. కాకపోతే.. అందులో కథ ఉండదు. చిన్న లైన్ తీసుకొని దాని చుట్టూ సన్నివేశాలు, భావోద్వేగాలతో కథని నడిపించారు. సెకండ్ హాఫ్ ఆడియన్స్ అనుకున్న స్థాయిలో రీచ్ కాలేకపోయింది. లవ్ స్టొరీ, ఎంటర్ టైన్మెంట్ మొత్తం ఫస్ట్ హాఫ్ కి పరిమితం అయిపోవడంతో సెకండ్ హాఫ్ కొద్దిగా ల్యాగ్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది. అలాగే సినిమాలో మెయిన్ కాస్టింగ్ తప్ప మిగిలిన వారిలో చాలా మంది కొత్త మొహాలు కనిపించడం కాస్తా రెగ్యులర్ ఆడియన్స్ కి ఇబ్బంది అనిపిస్తోంది.

మొత్తంగా :

శేఖర్ కమ్ముల సినిమా అంటే ప్రేక్షకులు ఎలాంటి ఎమోషన్స్ ఆశించి వెళ్తారో.. అవన్ని ఈ సినిమాలో ఉన్నాయి. దిల్ రాజు నిర్మాతగా సినిమా వస్తుందంటే.. అందులో ఖచ్చితంగా ఏదో విషయం ఉంటుందని మరోసారి రుజువైంది. ఇక సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం చెయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఆమె చాలా ప్రేమమ్ సినిమాతో ఎలాంటి క్రేజ్ సంపాదించుకుందో అందరికి తెలిసిందే. ఈ సినిమాలో కూడా ఆమె తన నటనతో ప్రేక్షకులని కట్టిపడేసింది. ఇక వరుణ్ తేజ్ కూడా గత సినిమాలని మించి తన మెచ్యూర్ పెర్ఫార్మెన్స్ తో ఆద్యంతం ఆకట్టుకుంటాడు. ఇక సినిమాకి పాటలు మరో బలం. ఇక ఒక్క మాటలో చెప్పాలంటే.. ఫ్యామిలీ ఎమోషన్స్ తో వచ్చిన మంచి లవ్ స్టోరీ ఈ ఫిదా.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -