Sunday, May 5, 2024
- Advertisement -

బాడీనే కాదు బుర్ర కూడా ఉండాలనేది అందుకే!

- Advertisement -

ఎవరైనా కొన్ని సార్లు కొన్ని పనులు చేసేటప్పుడు తమ శక్తి సామర్థ్యాలను అంచనా వేసుకొని పనులను చేస్తుంటారు. అలాంటప్పుడు ఖచ్చితంగా తప్పులో కాలేసినట్టే అవుతుంది.అందుకే కొన్ని సార్లు మన శక్తిసామర్థ్యాలను నమ్మకుండా మన తెలివి తేటలను ఉపయోగించాలనేది ఎన్నోసార్లు వినే ఉంటాం. అందుకే అంటారు బాడీ మాత్రమే పెరగకుండా, బుద్ధి కూడా పెరగాలని. ఇక్కడ ఒక చిరుతపులి చేసినపని అచ్చం ఇలాగే ఉంది.కేవల బుర్రకు పదును పెట్టి ఆలోచించకుండా ఎదురు దెబ్బ తినింది.

సాధారణంగా చిరుత గంటకు 95 కిలోమీటర్ల వేగంతో పరిగెత్త గలదు. అదేవిధంగా ఇంపాల కూడా గంటకు 80 కిలోమీటర్ల వేగం పరుగెత్త గలదు. ఈ విధంగా చూస్తే చిరుత దే పైచేయి అవుతుంది. చిరుత ఉన్న శక్తి సామర్థ్యంతో ఎంతో సునాయాసంగా ఇంపాలను చంపి తినవచ్చు. ఈ విధంగా ఒక ఇంపాలను చూసిన చిరుత దానిని వేటాడడానికి ప్రయత్నించింది. కానీ ఆ చిరుత చేతికి దొరకకుండా జిగ్ జాగ్ పద్ధతిలో ఇంపాల పరిగెడుతూ ఏకంగా చిరుతకి చుక్కలు చూపించింది.

ఈ విధంగా జిగ్ జాగ్ పద్ధతిలో పరిగెడుతున్న ఇంపాల చిరుతకు దొరకబోయే చివరిక్షణంలో ఒక్కసారిగా లాగి వెనుక కాళ్ళతో చిరుతను ఒక తన్ను తన్నింది. దీంతోఎంతో వేగంగా పరిగెడుతున్న చిరుత ఈ దెబ్బకు ఒక్కసారిగా అదుపు తప్పికింద పడింది. ఒక్క క్షణం బుర్ర పెట్టి ఆలోచించి ఉంటే ఇంపాల ఆ చిరుతకి ఆహారంగా తయారయ్యేది. ఆఫ్రికా అడవుల్లో జరిగిన ఈ అరుదైన సన్నివేశాన్ని ఈలు అనే ఒక ఫోటోగ్రాఫర్ తన కెమెరాలో బంధించి సామాజిక మాధ్యమంలో షేర్ చేశారు ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -