రాజన్న సిరిసిల్లలో చిరుత హల్ చల్.. భయంతో వణికి పోతున్న ప్రజలు!

- Advertisement -

గత ఏడాది నుంచి కృర మృగాలు అడవులు వదిలి ఊళ్లపై పడ్డాయి. ముఖ్యంగా తెలంగాణలో ఈ చిరుతలు పలు చోట్ల కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. నిన్న శంషాబాద్ లో చిరుత తిరగడం సీసీ కెమెరాలో చూసిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు చోట్ల చిరుత హల్ చల్ చేస్తూ జనాలను భయపెట్టిన విషయం తెలిసిందే.

తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం రామన్నపేట, కొలనూర్ గ్రామాల పరిసర ప్రాంతాల్లో చిరుత సంచారం కలకలం రేపుతోంది. 3 రోజుల క్రితం వేములవాడ అర్బన్ మండలం మారుపాక గ్రామ శివారులో చిరుత హల్ చల్ చేస్తోంది. 5 రోజుల క్రితం బోయినిపల్లి మండలం మల్కాపూర్‌లో చిరుత బావిలో పడిపోయింది. సిరిసిల్ల జిల్లాలో 10 రోజుల వ్యవధిలోనే మూడు చోట్ల చిరుత కనిపించింది. చిరుత సంచారంతో అక్కడ గ్రామస్థులు భయంతో వణికి పోతున్నరు. అధికారులు వెంటనే స్పందించి తమను రక్షించాలని కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News