Saturday, May 4, 2024
- Advertisement -

తెలంగాణ బీజేపీకి మరో షాక్?

- Advertisement -

అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర వైఫల్యంతో చతికిలపడ్డ బీజేపీకి త్వరలోనే మరో షాక్ తగలనుందా? కీలక నేతలు పార్టీని వీడేందుకు రంగం సిద్ధమవుతుందా?ఇంతకి పార్టీని వీడే ఆ నేతలు ఎవరు? ఇప్పుడు ఇదే బీజేపీ కార్యకర్తల్లో చర్చనీయాంశంగా మారింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేసింది బీజేపీ. పెద్ద ఎత్తున ఇతర పార్టీల నుండి నేతలను చేర్చుకుని అధికారంలోకి వస్తామనే విస్తృత ప్రచారం చేశారు. కానీ ఆ తర్వాత కొద్దిరోజుల్లోనే బీజేపీలో చేరిన నేతలంతా తిరిగి వెనక్కి వెళ్లిపోయారు. ఇంతలో ఎన్నికలు రాగా కేవలం సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది బీజేపీ.

ఇక త్వరలో లోక్ సభ ఎన్నికలు జరగనుండగా ఆ ఎన్నికల్లో సత్తాచాటాలని భావిస్తున్న బీజేపీలో మళ్లీ ప్రకంపనలు రాబోతున్నాయి. సీనియర్ నేతలు పార్టీని వీడేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం.
ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డితో పాటు మరో కీలక నేత బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల తర్వాత టార్గెట్ ఈటలగా ఓ వర్గం చేస్తున్న ఆరోపణలతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. దీనిని ఈటల ఎన్నిసార్లు ఖండించిన ఆయన పార్టీ మారుతారనే ప్రచారం ఆగడం లేదు. కాంగ్రెస్ అధికారప్రతినిధి సామా రామ్మోహన్ రెడ్డి స్వయంగా త్వరలోనే బీజేపీ బీసీ సీఎం అభ్యర్ధి కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు ట్వీట్ చేయడంతో కాంగ్రెస్‌లో పెద్ద ఎత్తున చేరికలుంటాయని తెలుస్తోంది. ఇదే జరిగితే బీజేపీకి లోక్ సభ ఎన్నికల వేళ గట్టి షాక్ తగులుతుందనే చెప్పుకోవాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -