- Advertisement -
మాజీ మంత్రి అంబటి రాంబాబుకు గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇటీవల ఆయనపై నమోదైన పలు కేసుల్లోనూ న్యాయస్థానం ఉపశమనం కల్పించింది. పోలీసుల కస్టడీ పిటిషన్‌ను కోర్టు డిస్మిస్ చేస్తూ, అవసరమైన షరతులతో బెయిల్ మంజూరు చేసింది.
2023 సంక్రాంతి సంబరాల పేరుతో లక్కీడ్రా నిర్వహించారనే ఆరోపణలపై నమోదైన కేసులోనూ అంబటి రాంబాబుకు ఇప్పటికే బెయిల్ లభించింది. అదేవిధంగా నవంబర్ 12న ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేక ర్యాలీ సందర్భంగా సీఐ విధులను అడ్డుకున్నారనే కేసులో కూడా ఆయనకు ఊరట దక్కింది.
ఇటీవల అంబటి రాంబాబుపై నమోదైన 35 కేసుల్లో అరెస్టు చేయవద్దని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
