ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు బెయిలా? కస్టడీనా? అన్నది నేడు తెలియనుంది. ఇప్పటికే ఈ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయి నెల రోజులు కావోస్తుంది. మూడోసారి రిమాండ్‌ను 14 రోజుల పాటు పొడగించగా ఒకవేళ బెయిల్ రాకపోతే ఈ నెల 19వరకు జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
ఇక ఇవాళ కీ డే. స్కిల్ స్కామ్ తో పాటు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్, ఫైబర్ గ్రేడ్ స్కామ్, అంగళ్ళు పలు కేసుల్లో బెయిల్, కస్టడీ పిటిషన్లపై ఇవాళ తీర్పు వెలువరించనుంది న్యాయస్థానం. దీంతో టీడీపీ శ్రేణులు ఉత్కంఠగా ఎదురుచూస్తుండగా బాబుకు బెయిల్ రాకపోతే ఏం చేయాలి అన్నదానిపై కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు టీడీపీ నేతలు.
అయితే చంద్రబాబు ఇన్వాల్వ్ అయింది అవినీతి కేసుల్లో అది స్వయంగా ఆయన ప్రమేయంతోనే జరిగింది అని సీఐడీ తరపు న్యాయవాదులు నిరూపించిన నేపథ్యంలో బెయిల్ రావడం అసాధ్యమేనని పలువురు న్యాయవాదులు చెబుతున్నారు. ఎందుకంటే సుప్రీం కోర్టు అవినీతి కేసుల్లో చాలా స్టిక్ట్‌గా ఉండటమే కాదు ప్రతీ చిన్న అంశాన్ని పరిశీలించాకే అవినీతి కేసుల్లో బెయిల్ ఇస్తుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు ఇప్పట్లో బెయిల్ వచ్చే పరిస్థితి లేదని న్యాయవాదుల అభిప్రాయం. ఇక సీఐడీ అధికారులు సైతం చంద్రబాబు రెండు రోజుల విచారణలో సహకరించలేదని మరిన్ని రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా చంద్రబాబు తరపు లాయర్లు లేవనెత్తిన ప్రతీ ప్రశ్నకు ధీటుగా జవాబు ఇచ్చిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో తీర్పుపై అందరిలోనూ ఉత్కంఠ మొదలైంది.
స్కిల్ స్కామ్ , అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్, ఫైబర్ గ్రేడ్ స్కామ్, అంగళ్ళు ఇన్ని కేసులు చుట్టిముట్టిన నేపథ్యంలో ఒక కేసులో బెయిల్ వచ్చినా మరో కేసులో అరెస్ట్ అయి జైల్లోనే బాబు ఉండాల్సి వస్తుంది టీడీపీ నేతలే చెబుతున్న పరిస్థితి. ఓ వైపు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి..మరోవైపు పార్టీకి జరగాల్సిన డ్యామేజ్ ఇప్పటికే జరిగిపోయింది. దీంతో టీడీపీ భవితవ్యం ఏంటో తెలియక అయోమయ స్థితిలో ఉన్నారు తెలుగు తమ్ముళ్లు.
