ఏపీ సీఎం చంద్రబాబు మాట మార్చారు. ఎన్నికల ముందు ఉచిత బస్సు అని ఉదరగొట్టి ఇప్పుడు దానిపై ఆంక్షలు విధించారు. శ్రీశైలంలో పర్యటనలో భాగంగా మాట్లాడిన చంద్రబాబు.. రాష్ట్రంలోని మహిళలు అందరికీ ఆగస్టు 15వ తేదీ నుంచి ఫ్రీ బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తామన్నారు.
ఇంతవరకు బాగానే ఉన్న ఆ తర్వాత కండీషన్స్ అప్లై అని చెప్పుకొచ్చారు. జిల్లాకు చెందిన మహిళలు ఆ జిల్లా వరకే ఉచితంగా తిరిగే అవకాశం ఉందని క్లారిటీ ఇచ్చారు. దీంతో ఫ్రీ బస్సుపై ఆశలు పెట్టుకున్న వారికి నిరాశే ఎదురైంది.
రాయలసీమ అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని, సాగునీటి ప్రాజెక్టులకు వేల కోట్లు ఖర్చు చేశామని ..పోలవరం ప్రాజెక్టు వల్లే రాయలసీమకు నీళ్లు వస్తున్నాయని చంద్రబాబు అన్నారు.జీడిపల్లికి నీరు తీసుకెళ్లే బాధ్యత తమ ప్రభుత్వానిదే అని …ఈ నెల 15 నాటికి ఆ ప్రాంతానికి నీరు రావాలని అధికారులకు టార్గెట్ పెట్టారు. తెలుగు జాతి ప్రపంచంలోనే నంబర్ వన్‌గా ఉండాలనేది తన కోరిక అన్నారు.
