- Advertisement -

టార్గెట్ శ్రీకాకుళం…జగన్ స్కెచ్ పక్కా!

- Advertisement -

ఏపీలో రెండోసారి అధికారంలోకి రావడానికి పక్కా ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నారు సీఎం జగన్. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా తొలుత టీడీపీ ప్రాతినిధ్యం ఉన్న ఎంపీ సీట్లని టార్గెట్ చేశారు. విజయవాడతో పాటు గుంటూరు, శ్రీకాకుళం ఎంపీ సీట్లను ఈ సారి గెలుపు వైసీపీదే కావాలని ధీమాతో ఉన్నారు జగన్.

ఇక గుంటూరు నుండి వైసీపీ తరపున భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కొంతకాలంగా ఆయన గుంటూరు ఎంపీ సెగ్మంట్ పరిధిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇక అలాగే శ్రీకాకుళం నుండి వైసీపీని గెలిపించి కింజారపు రామ్మోహన్‌ నాయుడుకి షాక్ ఇవ్వాలని భావిస్తున్నారు జగన్. వైసీపీ స్ధాపించిన దగ్గరి నుండి గెలవని ఎంపీ సీట్లలో శ్రీకాకుళం ఒకటి.

ఎర్రన్నాయుడు వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన రామ్మోహన్ నాయుడు వరుసగా రెండుసార్లు ఎంపీగా గెలిచారు.ఇక ఈ సారి హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు రామ్మోహన్ నాయుడు. అయితే ఈసారి టీడీపీకి షాకిచ్చితీరాలని వైసీపీ భావిస్తోంది. అందుకే బలమైన నేత కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. 1996 నుండి ఈ స్థానంలో ఒకసారి కాంగ్రెస్ గెలిస్తే అన్నిసార్లు టీడీపీదే విజయం. అందుకే సామాజికవర్గ సమీకరణతో పాటు బలమైన నేతను రంగంలోకి దించేందుకు వైసీపీ ప్లాన్ చేస్తోంది.

ఇందుకోసం ధర్మాన కృష్ణదాస్‌తో పాటు తమ్మినేని సీతారం, డాక్టర్ దానేటి శ్రీధర్‌, కేంద్రమాజీ మంత్రి కిల్లి కృపారాణి పేర్లను పరిశీలిస్తున్నారట. వీలైనంత త్వరగా అభ్యర్థిని ఫైనల్ చేసి ప్రజాక్షేత్రంలో దింపడం ద్వారా గెలుపు అవకాశాలను మరింత మెరుగుపర్చుకోవాలని జగన్ భావిస్తున్నారని సమాచారం. ఏదిఏమైనా ఈసారి శ్రీకాకుళంలో టీడీపీకి చెక్ పెట్టేందుకు వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు సత్ఫలితాన్నిస్తాయో వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -