- Advertisement -

మండపేట టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి!

- Advertisement -

ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది టీడీపీలో రోజుకో వివాదం వెలుగు చూస్తోంది. ఇప్పటికే విజయవాడ సెంట్రల్, శ్రీకాకుళం నియోజకవర్గంలో అసమ్మతి భగ్గుమనగా తాజాగా రాజమండ్రిలో ఓ హోటల్‌లో సమావేశమయ్యారు మండపేట టీడీపీ నేతలు. సిట్టింగ్ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావుకు వ్యతిరేకంగా అంతర్గత సమావేశం నిర్వహించారు.

స్థానిక టీడీపీ నేతలను సంప్రదించకుండా చంద్రబాబు…మండపేట ఎమ్మెల్యేగా జోగేశ్వరరావు పేరును ప్రకటించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. అభ్యర్థిని ప్రకటించే ముందు స్థానిక టీడీపీ నేతల అభిప్రాయం తీసుకుంటే బాగుండేదని…ఇప్పటికే మా నిర్ణయం తీసుకోవాలని లేదంటే పార్టీ నష్టపోవడం ఖాయమని హెచ్చరించారు.

ఇక జోగేశ్వరరావుపై వ్యతిరేకత ఒక వైపు అయితే మరోవైపు జనసేన నుండి లీలా కృష్ణ సైతం సీటు ఆశీంచి భంగపడ్డారు. ఆయన అవసరమైతే స్వతంత్ర్య అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఎమ్మెల్యే జోగేశ్వరరావుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సీనియర్ నేత బాలకృష్ణ.ఎమ్మెల్యేకి కేడర్‌ మీద గౌరవం, నమ్మకం లేదని అందుకే అంతర్గతంగా సమావేశమై భవిష్యత కార్యచరణపై చర్చించామని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -