Saturday, May 4, 2024
- Advertisement -

జగన్ మేనిఫెస్టో..గేమ్ ఛేంజరే!

- Advertisement -

2025 సార్వత్రిక ఎన్నికల వైసీపీ మేనిఫెస్టో సిద్ధమైంది. 2019 ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేశాకే 2024 ఎన్నికల్లో ఓట్లు అడుగుతామని చెప్పిన జగన్…చెప్పిన విధంగానే పూర్తిస్థాయిలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చారు. నేను విన్నాను.. నేను ఉన్నాను అంటూ భరోసా ఇచ్చారు.

ఇక ఈసారి కూడా వైసీపీ మేనిఫెస్టో ప్రజలకు హామీ ఇచ్చిన విధంగానే ఉండనుంది. అలవికాని హామీలు కాక సాధ్యమయ్యేవి, ప్రజలకు మాట ఇస్తే ఆ మాటను నిలబెట్టుకునే విధంగా మేనిఫెస్టోను రూపొందిస్తున్నారు. ఈ నెల 26న వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు జగన్.

బస్సు యాత్రలో ప్రజల నుండి వచ్చిన సూచనలు, సలహాలను జోడించి మేనిఫెస్టోకు తుదిరూపు ఇవ్వనున్నారు. ప్రస్తుత సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే…కొన్ని మార్పులతో మేనిఫెస్టో ఉండే అవకాశం ఉంది. అమ్మఒడి పరిధి పెంపు, పెన్షన్లు రూ 3 వేల నుంచి రూ 4 వేలకు పెంచే అవకాశం కనిపిస్తోండగా రుణమాఫీపై ప్రకటన ఉంటుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అలాగే రైతు భరోసా మరింత పెంచుతారా?, మహిళల కోసం కొత్త నిర్ణయాలు పార్టీ మేనిఫెస్టోలో ఎలాంటి పథకాలు ఉండనున్నాయి అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే టీడీపీ ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఆచరణలో అమలు సాధ్యం అయ్యే అవకాశం లేదు. అందుకే ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయడం కంటే ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేలా మేనిఫెస్టో రూపకల్పన చేస్తున్నారు జగన్. మొత్తంగా వైసీపీ మేనిఫెస్టో ఖచ్చితంగా గేమ్ ఛేంజర్‌గా ఉండటం ఖాయమని అంతా అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -