కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమికి బిగ్ షాక్. పార్లమెంట్ సమావేశాలకు ముందే బీజేపీ మాస్టర్ ప్లాన్ పక్కాగా అమలు చేస్తోంది. ఇప్పటికే టీఎంసీ, ఆప్, శివసేన చీలిక ఎంపీలు ఎన్డీఏకు మద్దతుగా నిలిచారు. కీలక బిల్లుల ఆమోదం వేళ టూ థర్డ్ మెజార్టీ దిశగా ఎన్డీఏ ఎంపీల సమీకరణ మొదలు పెట్టింది. అందులో భాగంగా ఎన్సీపీ రెండు వర్గాలకు ఏకం చేసి.. ఎన్డీఏలో చేరే విధంగా సర్వం సిద్దం చేసింది. ఈ పరిణామాలు ఇండియా కూటమికి అంతు చిక్కటం లేదు.
మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ) ఎన్డీయేలో చేరే అవకాశాలపై చర్చలు జరుగుతున్న వేళ.. ముందుగా ఎన్సీపీ రెండు వర్గాలు విలీనం కావాలనే ఫార్ములాను బీజేపీ పరిశీలిస్తోంది. రెండు వర్గాల మధ్య విలీనం పైన లోతైన చర్చలు జరుగుతున్నాయి. పార్లమెంట్ సమావేశాల సమయంలోనే విలీనం.. ఎన్డీఏలో చేరిక పైన నిర్ణయం లాంఛనంగా కనిపిస్తోంది. 2023 జులైలో ఎన్సీపీ చీలిపోయిన తర్వాత అజిత్ పవార్ వర్గం బీజేపీ-శివసేన ప్రభుత్వంలో చేరింది. ఈ ఏడాది బరామతి సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మరణించారు. అప్పటి నుంచి రెండు వర్గాల విలీనంపై మళ్లీ చర్చలు ఊపందుకున్నాయి. ఇటీవల ఎన్డీయే నేతలు, రెండు ఎన్సీపీ వర్గాల ప్రతినిధులు పలుమార్లు సమావేశమయి.. విలీనం దిశగా చర్చలు చేస్తున్నారని సమాచారం.
ఇప్పటికే పవార్ వర్గం ఎన్డీఏలో చేరిక పైన గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే.. రెండు గ్రూపులు విలీనం చేయటం ద్వారా రెండు పార్టీలుగా కాకుండా.. ఒకే పార్టీగా ఎన్డీఏలో ఉండాలని బీజేపీ అగ్ర నేతలు భావిస్తున్నారు. దీంతో.. కమలం పార్టీ మధ్యవర్తిత్వంతో విలీనం లాంఛనంగా కనిపిస్తోంది.ె ఎన్సీపీ పవర్ వర్గానికి చెంది ఎక్కువ మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు నేరుగా ఎన్డీయేలో చేరాలని కోరుకుంటున్నట్లు సమాచారం. కేంద్రం, మహారాష్ట్ర ప్రభుత్వాల్లో భాగమైతే పార్టీ బలోపేతానికి ఉపయోగపడుతుందని వారు భావిస్తున్నారు. విలీనం జరిగితే పార్టీ అధ్యక్ష పదవిని సునేత్రా పవార్‌కు .. పవర్ కుమార్తెకు కేంద్ర మంత్రి పదవి ఇచ్చేలా ప్రతిపాదనలు సిద్దం అయ్యాయి. లోక్‌సభలో ఎనిమిది మంది ఎంపీలు ఉన్న శరద్ పవార్ వర్గం మద్దతు పార్లమెంట్ లో కీలక బిల్లు ల వేళ కీలకంగా మారనుంది.
