Wednesday, May 15, 2024
- Advertisement -

షాక్‌ల మీద షాక్‌లు…జానారెడ్డి కమిటీ విఫలం!

- Advertisement -

తెలంగాణ కాంగ్రెస్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. గతంలో ఎన్నడూ జరగని విధంగా హస్తం పార్టీకి పెద్ద డ్యామేజ్ జరిగింది. సీనియర్ నేతలు , మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల దగ్గరి నుండి నేతలంతా పార్టీని వీడుతున్నారు. నాగం జనార్థాన్ రెడ్డి, పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి ఇప్పటికే కారెక్కుతామని ప్రకటించగా అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

అయితే ఈ పరిస్థితిని ముందే ఊహించిన కాంగ్రెస్ అంసతృప్తులను బుజ్జగించేందుకు ఓ కమిటీ వేసింది. దీనికి జానారెడ్డి నేతృత్వం వహించనుండగా ఇందులో సభ్యులుగా మాణిక్ రావ్ ఠాక్రే, మీనాక్షి నటరాజన్,దీపాదాస్ మున్షీ ఉన్నారు. అసంతృప్తులను బుజ్జగించి వాళ్ళని పార్టీలోనే కంటిన్యు అయ్యేట్లుగా ఒప్పించి, కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవడం ఈ కమిటీ పని.

కానీ క్షేత్రస్ధాయిలో ఈ కమిటీ పూర్తిగా విఫలమైంది. టికెట్ దక్కని వారు కాంగ్రెస్ నేతలపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. త్వరలోనే గాంధీ భవన్ అమ్మడం ఖాయమని కామెంట్స్ చేస్తూ కోట్ల రూపాయలకు టికెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపిస్తున్నారు. నేతల ఆరోపణలు ఎలా ఉన్నా కనీసం వారిని సంప్రదించి బుజ్జగించే పని కూడా చేయడం లేదు జానారెడ్డి. ఎందుకంటే జానా…నాగార్జున సాగర్ నుండి బరిలో ఉన్న తన తనయుడు రఘువీర్ గెలుపుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. దీంతో ఈ కమిటీ నామమాత్రమేనని తెలుస్తోంది. అందుకు జానారెడ్డి కమిటి ఫెయిలైందని హస్తం నేతలే మాట్లాడుతున్న పరిస్థితి నెలకొంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -