Sunday, May 19, 2024
- Advertisement -

బీజేపీతో తెగతెంపులే…తెల్చేసిన పవన్‌!

- Advertisement -

ఇప్పటివరకు ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన అధినేత పవన్‌ ఆ పార్టీకి రాంరాం చెప్పారా?,టీడీపీతో పొత్తు తర్వాత పవన్ వైఖరిలో మార్పు వచ్చిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. టీడీపీతో పొత్తు పవన్‌లో జోష్ నింపింది. అందుకే రెట్టించిన ఉత్సాహంతో టీడీపీ శ్రేణుల కంటే ఎక్కువగా స్పందిస్తున్నారు పవన్. అయితే ఎన్నికల వరకైనా బీజేపీతో పొత్తు ఉంటుందని అంతా భావించినా ఆ పుకార్లకు పుల్ స్టాప్ పెట్టేశారు.

తెలంగాణలో పోటీ చేసే స్ధానాలను ప్రకటించారు పవన్. 32 స్ధానాల్లో జనసేన పోటీ చేస్తుందని…పోటీ చేసే స్ధానాలను కూడా ఖరారు చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఏన్డీయే కూటమిలో ఉన్న పవన్…ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించడంతో ఆ కూటమికి దూనమైనట్లేనని తెలుస్తోంది.

ఇక వాస్తవానికి బీజేపీతో కంటే టీడీపీతో కలిసి వెళ్తేనే తనకు కలిసి వస్తుందని పవన్ భావించారు. అయితే చంద్రబాబు అరెస్ట్ రూపంలో జాక్ పాట్ తగలడంతో అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అందుకే ఎన్డీయే కూటమిలో ఉన్నా బీజేపీతో సంప్రదించకుండానే టీడీపీతో పొత్తును ఖరారు చేశారు. ఇక వారాహి యాత్రలో ఏపీలో వచ్చేది టీడీపీ – జనసేన సంకీర్ణమేనని చెబుతున్నారు. దీంతో బీజేపీకి రాంరాం చెప్పినట్లేనని అంతా భావిస్తున్న తరుణంలో తెలంగాణలో పోటీచేసే స్థానాలను ప్రకటించి బీజేపీతో దోస్తికి పుల్ స్టాప్ పెట్టేశారు పవన్‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -