- Advertisement -

ఇకనైనా జగన్ నామం ఆపు..చంద్రబాబు!

- Advertisement -

ఏపీలో ఎక్కడ ఏం జరిగిన జగన్ పేరు చెప్పడం ఏపీ సీఎం చంద్రబాబుకు కామన్ అయి పోయింది. ఈ నేపథ్యంలో పిఠాపురం పర్యటనలో భాగంగా స్పందించిన జగన్…చంద్రబాబు తీరును తప్పబట్టారు. చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంతో విజయవాడ అతలాకుతలం కాగా అదే తరహాలో ఏలేరు రిజర్వాయర్‌ రైతులను ముంచేసిందని మండిపడ్డారు.

వరదలపై కేంద్రం ముందే హెచ్చరించిన చంద్రబాబు కనీసం పట్టించుకోలేదన్నారు. కనీసం ఏలేరూ రిజర్వాయర్‌కు వచ్చే ఇన్‌ఫ్లోను ఎందుకు మేనేజ్‌ చేయలేకపోయారు అని ప్రశ్నించారు. రిజర్వాయర్‌ నిండేవరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు ఆ తర్వాత నీటిని కిందకు వదిలారు..ఇది ఖచ్చితంగా ప్రభుత్వం సృష్టించిన వరదలే అన్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు గడిచింది..పాలనను పక్కకు పెట్టి తనపై విమర్శలే పనిగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు గోబెల్స్‌ ప్రచారారానికి తోడు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లాంటి ఎల్లో మీడియా తోడైందన్నారు. సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థనలనూ నాశనం చేశారు అని మండిపడ్డారు.

రైతులకు పంట నష్టం జరిగితే, గతంలో అన్ని వ్యవస్థలు పక్కాగా ఉండేవి కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. వైసీపీ ప్రభుత్వం ఉంటే రైతులకు ఇప్పటికే పెట్టుబడి సాయం అందేదని కానీ చంద్రబాబు హయాంలో అలాంటి పరిస్థితి లేదన్నారు. పవన్‌ కల్యాణ్‌ ఓ సినిమా ఆర్టిస్ట్‌, చంద్రబాబు ఓ డ్రామా ఆర్టిస్ట్‌ అని జగన్‌ చెప్పారు. గత ప్రభుత్వం అంటూ ఇంకెన్ని రోజులు కాలయాపన చేస్తారని ప్రశ్నించారు జగన్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -