కాకినాడ జిల్లా సామర్ల కోట వేదికగా ఎన్నికల శంఖారావాన్ని పూరించిన వైసీపీ అధినేత, సీఎం జగన్..టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, బాలకృష్ణతో పాటు జనసేనాని పవన్‌లపై పంచ్‌లు వేశారు. జగన్ వేసిన పంచ్‌లకు ప్రజల నుండి అనూహ్య స్పందన రాగా ముఖ్యంగా పవన్‌పై వేసిన జోకులను ప్రజలు నవ్వుకున్నారు.
పవన్ ప్యాకేజీ స్టార్, దత్త పుత్రుడు అంటూ పవన్‌ను ఎద్దేవా చేశారు. ఇక పపన్ వ్యక్తిగత విషయాలను ప్రస్తావించిన జగన్..పవన్ సొంత ఇల్లు హైదరాబాద్‌లో ఉంది కానీ ఆయన ఇల్లాలు మాత్రం మూడు, నాలుగు సంవత్సరాలకు ఒకసారి మారుస్తారని మండిపడ్డారు. ఓ సారి లోకల్ మరోసారి నేషనల్ తర్వాత ఇంటర్నేషనల్ ఈసారి ఏం చేస్తారో అంటూ పవన్ భార్యల గురించి కౌంటర్ ఇచ్చారు. ఇది పవన్‌కు ఆడవారంటే గౌరవం..మన ఇళ్లల్లో ఇలాంటి పరిస్థితి ఉంటే ఏం జరుగుతుందో ఆలోచించాలన్నారు.
సరుకులు, సరంజామాను అమ్ముకునే వాళ్లను చూశాం కానీ అభిమానుల ఓట్లను అమ్ముకున్న వ్యక్తి పవన్ అని మండిపడ్డారు. రెండు సినిమా షూటింగ్‌ల మధ్య విరామాలు, అప్పుడప్పుడు కనిపించడం ఇది పవన్ లాంటి వ్యాపారికే చెందుతుందన్నారు. ఇలాంటి విలువలు లేని వ్యక్తికి ప్రజలు బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. దత్తపుత్రుడికి చిరునామా హైదరాబాద్ అని…ప్యాకేజీ స్టార్‌కు భీమవరం, గాజువాకతో సంబంధం లేదన్నారు. తన రాజకీయ జీవితంలో సరుకులు అమ్మే వారిని చూశాను కానీ హోల్‌సేల్‌గా పార్టీనే అమ్ముకున్న వ్యక్తిని పవన్‌నే చూశానని చురకలు అంటించారు.
మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు రాష్ట్రంలోని ఏ ఒక్క ప్రజలకు ఇంటి జాగా ఇవ్వలేదన్నారు. చంద్రబాబు సొంతిల్లు పక్కరాష్ట్రంలోనే ఉందని…దోచుకుంది తినడం తప్ప చంద్రబాబుకు ఏది చేతకాదన్నారు. వచ్చే ఎన్నికల్లో దత్తపుత్రుడికి, చినబాబుకు,చంద్రబాబు బావమరిదికి బుద్ది చెప్పాలన్నారు. అధికారం లేకపోయే సరికి ఆగంఆగం అవుతున్నారని …వారికి మద్దతుగా నాలుగైదు టీవీ ఛానళ్లు, రెండు పేపర్లు, ఎల్లో సోషల్ మీడియా దీనికి తోడు దత్తపుత్రుడు తప్ప ప్రజలు లేరన్నారు.
