Wednesday, May 22, 2024
- Advertisement -

Janasena:తెలంగాణలో 32 స్ధానాల్లో పోటీ

- Advertisement -

తెలంగాణలో పోటీ చేసే స్ధానాలను ప్రకటించింది జనసేన. 32 స్ధానాల్లో పోటీచేస్తామని ప్రకటించగా పొత్తులుంటే స్ధానాల్లో మార్పు ఉండే అవకాశం ఉందని తెలంగాణ జనసేన ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి చెప్పారు. ఒంటరిగా వెళ్లడానికి పార్టీ సిద్ధంగా ఉందని వెల్లడించారు. ఈ స్ధానాల్లో యువత,మహిళలకే అధిక సీట్లు కేటాయిస్తామని వెల్లడించారు.

జనసేన పోటీ చేసే స్ధానాల్లో కూకట్‌పల్లి, ఎల్బీనగర్‌, నాగర్‌కర్నూల్‌, వైరా, ఖమ్మం, మునుగోడు, కుత్బుల్లాపూర్‌, శేరిలింగంపల్లి, పటాన్‌చెరు, సనత్‌నగర్‌, కొత్తగూడెం, ఉప్పల్‌, అశ్వారావుపేట, పాలకుర్తి, నర్సంపేట, స్టేషన్‌ఘన్‌పూర్‌, హుస్నాబాద్‌, రామగుండం, జగిత్యాల, నకిరేకల్‌, హుజూర్‌నగర్‌, మంథని, కోదాడ, సత్తుపల్లి, వరంగల్‌ వెస్ట్‌, వరంగల్‌ ఈస్ట్‌, మల్కాజిగిరి, ఖానాపూర్‌, మేడ్చల్‌, పాలేరు, ఇల్లందు, మధిర ఉన్నాయి.

ఇక తెలంగాణలో పోటీ చేసే స్ధానాలను ప్రకటించగా ఏపీలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. టీడీపీ – జనసేన పొత్తు ఖరారుకాగా ఎన్ని స్ధానాలు జనసేనకు ఇస్తారనేది సందిగ్ధంగానే మిగిలిపోయింది. టీడీపీ – జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను త్వరలో రిలీజ్ చేయనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -