ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగుల బదిలీలపై నిషేధం సడలించింది. మే 1 నుండి మే 31, 2026 వరకు బదిలీల ప్రక్రియ జరగనుండగా 3 ఏళ్లు పూర్తి చేసిన ఉద్యోగులు బదిలీలకు అర్హులు అవుతారని వెల్లడించింది.
ఒకే చోట 4 ఏళ్లు దాటితే తప్పనిసరి బదిలీ అని తెలిపింది. 31 మే 2027కి ముందే రిటైర్ అయ్యే వారికి మినహాయింపు ఇవ్వగా ఒక్కో కేడర్లో గరిష్టంగా 40% మందికే బదిలీలు ఉండనున్నాయి.
భార్యాభర్తలు, వికలాంగులు, వైద్య కారణాలకు ప్రాధాన్యం ఇవ్వగా క్యాన్సర్, కిడ్నీ, హృదయ శస్త్రచికిత్స వంటి కేసులకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. కష్ట ప్రాంతాల్లో ఎక్కువ కాలం పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇవ్వనుండగా బదిలీలు పూర్తిగా కౌన్సెలింగ్ విధానంలో నిర్వహించనున్నారు.
ఆన్లైన్/వెబ్ ఆధారిత విధానం ద్వారా పారదర్శకతతో బదిలీలు చేపట్టనుండగా ఉద్యోగుల నుంచి 5 ఆప్షన్లు తీసుకోనున్నారు అధికారులు. జూన్ 1, 2026 నుంచి మళ్లీ బదిలీలపై నిషేధం అమలులో ఉండగా మొత్తం ప్రక్రియ పారదర్శకంగా, నియమావళి ప్రకారం నిర్వహణకు ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది.
