Thursday, May 23, 2024
- Advertisement -

అఫిషియల్‌:పవన్‌ గుడ్‌ బై..బీజేపీ పరిస్థితి ఏంటో?

- Advertisement -

అంతా ఊహించిందే జరిగింది…బీజేపీ చెవిలో పువ్వు పెట్టి ఎన్డీయే కూటమి నుండి బయటికి వచ్చారు పవన్. దీంతో బీజేపీకి ఒంటరి పోరు తప్ప మిగిలిందేమి లేదు. కృష్ణజిల్లా పెడనలో జరిగిన వారాహి యాత్రలో పవన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకోగా పవన్‌ మైండ్ సెట్ అర్థం కాక బీజేపీ నేతలు అయోమయంలో పడ్డారు.

వాస్తవానికి కొద్దికాలం క్రితం మోడీ నేతృత్వంలో జరిగిన ఎన్డీయే పక్షాల భేటీకి హాజరయ్యారు పవన్‌. ఆ తర్వాత బీజేపీతో కలిసే ఎన్నికల్లో పోటీ చేస్తామని వెల్లడించారు. కానీ ఎప్పుడైతే చంద్రబాబు అరెస్ట్ అయి, రాజమండ్రి జైలులో బాబుతో ములాఖత్ జరిగిన తర్వాత పవన్‌ పొలిటికల్ గేమ్‌ పూర్తిగా మారిపోయింది. ఎలాంటి సమావేశం లేకుండానే, జనసైనికుల అభిప్రాయం తీసుకోకుండానే టీడీపీతో పొత్తును అనౌన్స్ చేశారు. ఇక అదే సమయంలో బీజేపీ కలిసివస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. దీంతో త్వరలోనే టీడీపీ – జనసేన కూటమిలో బీజేపీ చేరుతుందని అంతా భావించారు. కానీ రానురాను టీడీపీ – జనసేన కూటమికి బీజేపీకి గ్యాప్ పెరిగిపోయింది.

దీంతో ఇక బీజేపీతో ఏం లాభం అనుకున్నారో తెలియదు కానీ అధికారంలోకి వచ్చేది టీడీపీ – జనసేక సంకీర్ణ సర్కారేనని చెబుతూ వస్తున్నారు పవన్. అయితే తాజాగా కృష్ణ జిల్లాలో స్వరం మార్చి ఎన్డీయే కూటమి నుండి బయటకు వచ్చినట్లు ప్రకటించారు. దీంతో నిన్నటివరకు పవన్ మావాడే అని చెబుతూ వచ్చిన బీజేపీ నేతలు ఇప్పుడు డిఫెన్స్‌లో పడ్డారు. పవన్ నిర్ణయం వెనుక వ్యూహాత్మక ఎత్తుగడే ఉందని తెలుస్తోంది.

ఈసారి ఎలాగైన అసెంబ్లీలో అడుగుపెట్టాలని చూస్తున్న పవన్‌…బీజేపీతో పొత్తుతో నష్టమనే నిర్ణయానికి వచ్చారట. బీజేపీతో కలిసి పోటీచేస్తే క్రిస్టియన్, మైనారిటీ ఓటు బ్యాంకు మిస్ అయ్యే అవకాశం ఉందని అంచనాకు వచ్చారట. అలాగే ప్రత్యేక హోదా, విభజన హామీల విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఏపీ ప్రజలు గుర్రుగా ఉన్నారు. దీంతో ఎన్డీయేలో ఉండడంవల్ల నష్టమే తప్పా లాభం లేదని భావించి ఆ కూటమని బయటకు వచ్చారని విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తంగా పవన్‌ ఆడిన పొలిటికల్ గేమ్‌లో బీజేపీ డమ్మీ అయిపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -