- Advertisement -

చంద్రబాబు కాన్వాయ్‌ కోసం ఏకంగా!

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాన్వాయ్ కోసం కూటమి ప్రభుత్వం భారీ ఎత్తున నిధులను మంజూరు చేసింది. సరికొత్త రక్షణ మరియు విలాసవంతమైన వాహనాల కొనుగోలుకు గాను మొత్తం రూ. 18.66 కోట్లు కేటాయిస్తూ కేవలం రెండు రోజుల వ్యవధిలోనే మూడు వేర్వేరు ప్రభుత్వ ఉత్తర్వులను (జీవోలను) జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి భద్రతను మరింత పటిష్టం చేసే దిశగా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు నాయుడు అధికారిక కాన్వాయ్‌లో అధునాతన రక్షణ వసతులు కల్పించేందుకు, సరికొత్త వాహనాలను కొనుగోలు చేసేందుకు గాను రూ. 18.66 కోట్ల నిధులను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిఘా వర్గాల భద్రతా సూచనల మేరకు ఈ నిధులను మంజూరు చేసినట్లు తెలుస్తోంది.

అధునాతన జామర్ వాహనాల కోసంరూ. 12.28 కోట్లు,సాధారణ జామర్ వాహనాల కోసం రూ. 3.74 కోట్లు, ఫార్చూనర్ లగ్జరీ ఎస్కార్ట్ కార్ల కోసం రూ. 2.64 కోట్లు మొత్తంగా రూ. 18.66 కోట్లు కేటాయించారు.భద్రతా కారణాల దృష్ట్యా సీఎం కాన్వాయ్‌లో జామర్ వాహనాలు అత్యంత కీలకంగా వ్యవహరిస్తాయి. శత్రువుల నుండి ఎదురయ్యే వైర్‌లెస్ లేదా రిమోట్ ఆధారిత ముప్పులను తిప్పికొట్టేందుకు ఈ సరికొత్త అధునాతన జామర్లను కొనుగోలు చేస్తున్నారు.

అయితే గతంలో సీఎం కాన్వాయ్‌లో పొదుపు కోసం కుదింపు అంటూ ఉదరగొట్టిన చంద్రబాబు… ఇప్పుడు ఏకంగా తన కాన్వాయ్ కోసం ఏకంగా రూ.19 కోట్ల దాకా ఖర్చు పెడుతుండటం తీవ్ర విమర్శలు తావిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -