- Advertisement -

ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు…డిస్పోజ్

- Advertisement -

ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులో దాఖలైన అనర్హత పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ జరిపి కేసును డిస్పోజ్ చేసింది. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల విషయంలో ఇప్పటికే స్పీకర్ నిర్ణయం తీసుకున్నట్లు కోర్టుకు తెలియజేయడంతో ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది.

సమాచారం ప్రకారం, ఈ కేసులో మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై వచ్చిన ఫిరాయింపు ఆరోపణలను పరిశీలించిన తర్వాత స్పీకర్ వారికి క్లీన్ చీట్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని స్పీకర్ తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టుకు వివరించారు.

విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. స్పీకర్ ఇచ్చిన నిర్ణయాలను రెండు రోజుల్లోపు అధికారికంగా ప్రకటించాలని కోర్టు ఆదేశించింది. అలాగే ఆ నిర్ణయాలకు సంబంధించిన అధికారిక కాపీలను పిటిషనర్లకు అందజేయాలని కూడా స్పష్టం చేసింది.

అదేవిధంగా పిటిషనర్లు కోరిన డాక్యుమెంట్లు, ఆధారాలను నాలుగు రోజుల్లో అందించాలని స్పీకర్‌ను కోర్టు ఆదేశించింది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించింది.

ఎమ్మెల్యేల ఫిరాయింపుల అంశం రాజకీయంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇప్పుడు స్పీకర్ అధికారికంగా నిర్ణయాలను ప్రకటించిన తర్వాత తదుపరి రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తిగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -