Tuesday, May 14, 2024
- Advertisement -

రేవంత్ దూకుడు..మరో సంచలన నిర్ణయం

- Advertisement -

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలీలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్న రేవంత్ మరో అడుగు ముందుకేశారు. త్వరలోనే రాష్ట్ర సలహా మండలి ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. సలహా మండలి ఛైర్మన్‌గా సీఎం రేవంత్ రెడ్డి ఉండగా మేధావులకు చోటు కల్పించారు. బీఎస్పీ చీఫ్ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్, ఆకునూరి మురళి,ప్రొఫెసర్లు హరగోపాల్, నాగేశ్వర్‌రావు ఉన్నారు.

గురుకులాలు, మండల స్థాయిలో ఏర్పాటు చేసే ఆలోచనలో ఉండగా వీరు ప్రభుత్వానికి కీలక సూచనలు చేయనున్నారు. సీఎం రేవంత్ నిర్ణయంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఇక మరోవైపు పార్టీలో నామినేట్ పోస్టులపై దృష్టి సారించారు రేవంత్.

ఎన్నికల సందర్బంగా నేతలకు ఇచ్చిన హామీ ప్రకారం ముందుకు వెళ్లనున్నారు రేవంత్. ఇప్పటికే డిల్లీ పెద్దలతో పలుమార్లు సమావేశం కూడా అయ్యారు. మొదటి నుంచి పార్టీ కోసం పని చేసిన వారికే పోస్టుల కేటాయింపు చేయనున్నారు. రేపు జరిగే పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో ఈ మేరకు క్లారిటీ ఇవ్వనున్నారు రేవంత్. లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం 20 నుంచి 30 నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -