Tuesday, May 14, 2024
- Advertisement -

తెలంగాణలో కాంగ్రెస్‌కే అనుకూలం..!

- Advertisement -

తెలంగాణలో కాంగ్రెస్ గాలి వీస్తోందని ఆ పార్టీకే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు ప్రొ. నాగేశ్వరరావు. తన యూ ట్యూబ్ ఛానల్ ద్వారా రాజకీయ పరిస్థితులపై ఎప్పటికప్పుడు విశ్లేషణ అందించే నాగేశ్వరరావు తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న తరుణంలో కాంగ్రెస్‌కు అనుకూల పరిస్థితులు ఉన్నాయని వెల్లడించారు.

కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల పట్ల ప్రజల్లో నమ్మకం కలిగిందని..గత రెండు నెలల్లో కాంగ్రెస్ గ్రాఫ్ మరింత పెరిగిందన్నారు. ముస్లింలు, సీమాంధ్ర ఓటర్లు కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపుతున్నారని వెల్లడించారు. ఇక 2018లో జరిగిన ఎన్నికలతో పోలిస్తే మజ్లిస్ ఈ సారి రెండు సీట్లు కొల్పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు.

నాంపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్‌ ఫిరోజ్‌ఖాన్‌ కు అనుకూలంగా ఉందని..ముస్లిం ఓట్లరు బీఆర్ఎస్ – ఎంఐఎం కూటమికి వ్యతిరేకంగా ఉన్నారన్నారు. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్‌పై బీఆర్‌ఎస్ నేతల వ్యతిరేక స్పందన నేపథ్యంలో సీమాంధ్ర ఓటర్లు కూడా కాంగ్రెస్‌కు అండగా నిలుస్తున్నారని చెప్పారు.యువత, ప్రభుత్వ ఉద్యోగులు బీఆర్‌ఎస్‌పై విసుగు చెందారని… బిఆర్‌ఎస్ ప్రభుత్వం తమ రుణాలను మాఫీ చేయకుండా వడ్డీకే పరిమితం చేయడం పట్ల రైతులు సైతం అసంతృప్తితో ఉన్నారని నాగేశ్వరావు అభిప్రాయపడ్డారు. ఇంత వ్యతిరేకత నేపథ్యంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళిత బంధు, రైతు బంధు అమలు ఆగిపోతుందన్న బీఆర్‌ఎస్ నేతలు విస్తృత ప్రచారం చేసినా అది ప్రయోజనం లేకపోయిందన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -