- Advertisement -

చంద్రబాబు మార్క్ బదిలీలు..

- Advertisement -

చంద్రబాబు మారలేదు. తన మార్క్ రాజకీయంలో ఎలాంటి మార్పు లేదు. మభ్య పెట్టటం తాను ఏం చేసినా అందరికీ ఆమోదమే అనే అత్మవంచనతో వ్యవహరించటం అలావాటుగా మారి పోయింది. తిరుపతి తొక్కిసలాట ఘటన పైన కోట్లాది మంది భక్తుల్లో ఆందోళన కనిపించింది. ఈ ఘటన పూర్తిగా అధికారుల నిర్లక్ష్యమే కారణమని స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ , టీటీడీ ఛైర్మన్ స్పష్టంగా చెప్పారు. ఘటన జరిగిన తరువాత చంద్రబాబు వ్యవహరించిన తీరు పైన విమర్శలు ఉన్నాయి. ఇక, ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలు అంత కంటే వివాదంగా మారుతున్నాయి.

తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటనా స్థలిని చంద్రబాబు పరిశీలించే సమయంలో హైడ్రామా చోటు చేసుకుంది. షర్టుకు మైకు పెట్టుకొని.. తన పరిశీలన మొత్తం నేరుగా టీవీల్లో లైవ్ లో వచ్చేలా ఏర్పాట్లు చేసారు. ఘటన పైన ప్రజల్లో ఉన్న ఆగ్రహం గుర్తించిన చంద్రబాబు అధికారులను ఆ మైక్ లో వినిపించేలా మందిలిస్తూ.. లేని కోపోన్ని ప్రదర్శిస్తూ హైడ్రామా క్రియేట్ చేసారు. అదే సమయంలో పవన్ కల్యాన్ తన రూటే సపరేటు అనే విధంగా తన దారిని తాను పరామర్శలు.. ప్రకటనలు చేసారు. చంద్రబాబు ఘటనకు బాధ్యులుగా తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు తో పాటుగా స్థానిక అధికారుల పైన బదిలీ వేటు వేసారు. అంతే, వారి పైన అంతకు మించి ఎలాంటి చర్యలు లేవు.

ఉప ముఖ్యమంత్రి పవన్ టీటీడీ అధికారుల పైన ఆగ్రహం వ్యక్తం చేసినా.. వారి పైన చర్యలకు చంద్రబాబు సిద్ద పడలేదు. నాడు ప్రజల్లో ఉన్న ఆగ్రహం చల్లార్చేలా తిరుపతి ఎస్పీని బదిలీ చేసిన చంద్రబాబు.. వారం లోనే తిరిగి అదే ఎస్పీకి అక్కడే అంటే తిరుపతిలోనే రెడ్ శాండల్ అక్రమ రవాణా నిరోధ బాధ్యతల పేరుతో పోస్టింగ్ ఇచ్చారు. అంటే, తొక్కిసలాట ఘటనలో బదిలీ వేటు పడిన సుబ్బారాయుడు తిరిగి అదే తిరుపతిలో విధులు నిర్వహించేలా చంద్రబాబు అవకాశం కల్పించారు. ఇదే సుబ్బారాయుడుని చంద్రబాబు ఏరి కోరి తెలంగాణ సర్వీసు నుంచి ఏపికి తెప్పించుకున్నారు. ఇప్పుడు తిరిగి తిరుపతిలో పోస్టింగ్ తో తనకు మాత్రమే సాధ్యమైన నిర్ణయాలు ఎలా ఉంటాయో నిరూపించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -