- Advertisement -

డిసెంబర్ 30 నుండి వైకుంఠ ద్వార దర్శనాలు

- Advertisement -

శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు జరుగుతాయి అన్నారు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు. టీటీడీ పాలకమండలి నిర్ణయాలను వెల్లడించిన ఛైర్మన్… మొదటి 3 రోజులు ఆన్ లైన్ లో ఈ-డిప్ ద్వారా సర్వదర్శనం టోకన్లు పొందిన వారికి మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామన్నారు.

నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1 వరకు వైకుంఠ ద్వార దర్శన టోకన్లు కోసం ఈ- డిప్ లో రిజిస్ట్రేషన్ కు అవకాశం ఉంటుంది అన్నారు. సీఎం చంద్రబాబు అదేశాల మేరకు సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించాం… 8 లక్షల మంది వైకుంఠ ద్వార దర్శనం టోకన్లు ఇస్తామన్నారు.

స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా సిఫార్సు లేఖలపై ఏడు రోజులు దర్శనాలు రద్దు చేస్తున్నామని… స్థానికుల కోసం జనవరి 6,7,8వ తేదీల్లో రోజుకు 5 వేల చొప్పున ఆన్ లైన్ లో సర్వదర్శనం టోకన్లు జారీ చేస్తామన్నారు. పరకామణి కేసును నిష్పక్షపాతంగా విచారణ జరపాలని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని బోర్డు నిర్ణయం తీసుకుందన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -