విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌ను కలిశారు. జగన్ విశాఖ జిల్లా పర్యటనలో భాగంగా తమ సమస్యలపై వినతి పత్రం అందజేశారు. వారి సమస్యలు సావధానంగా విన్న జగన్ స్టీల్ ప్లాంట్ కార్మికులకు వైసీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
అలాగే విశాఖ పర్యటనలో జగన్‌ను బల్క్ డ్రగ్ పార్క్ బాధితులు కలిశారు. కాలుష్య కారక పరిశ్రమలు తమకు వద్దని మత్స్యకారులు వైయస్ జగన్ దృష్టికి తెచ్చారు. నక్కపల్లి మండలానికి చెందిన 16 గ్రామాల మత్స్యకారులు తరలి వచ్చి వైయస్ జగన్‌కు తమ బాధలు చెప్పుకున్నారు. బల్క్ డ్రగ్ పార్క్ ను అడ్డుకోవాలని బాధితులు వినతిపత్రం అందజేశారు.
జి.భీమవరం వద్ద పోలీసులు మత్స్యకారులను అడ్డుకున్నారు. జగన్‌ను కలిసేందుకు అనుమతి లేదంటూ వెనక్కి పంపించే కార్యక్రమానికి తెరలేపగా, జగన్‌ను కలిసి తీరుతామని మత్స్యకారులు స్పష్టం చేశారు. కూటమి నేతలను నమ్మి ఓటు వేసినందుకు తమను నిలువునా మోసం చేశారని గంగపుత్రుల ఆవేదన వ్యక్తం చేశారు.
