- Advertisement -

ఉగాది..ప్రజల సంస్కృతికి ప్రతీక

- Advertisement -

ఉగాది పండుగ తెలుగు ప్రజల సంస్కృతి, సంప్రదాయాల ప్రతీకగా నిలుస్తుందని మాజీ సీఎం జగన్ పేర్కొన్నారు. శ్రీ పరాభవ నామ సంవత్సరాది సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, ఉగాది పండుగ కేవలం కొత్త సంవత్సరం ఆరంభమే కాకుండా, మన సంస్కృతి గౌరవాన్ని, ఐక్యతను ప్రతిబింబించే పర్వదినమని అన్నారు. ప్రతి ఇంట్లో ఆనందం, శాంతి నెలకొని, ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. కొత్త సంవత్సరంలో రాష్ట్ర ప్రజలందరికీ విజయాలు సిద్ధించాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని కోరుకున్నారు.

రైతులకు మంచి కాలం రావాలని, అన్ని వృత్తుల వారు అభివృద్ధి చెందాలని, గ్రామాలు, పట్టణాలు సుభిక్షంగా మారాలని ఆయన ఆకాంక్షించారు. అలాగే మన సంస్కృతి సంప్రదాయాలు తరతరాలకు కొనసాగాలని, ఉగాది పండుగను అందరూ సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

ఇక ఉగాది సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక వేడుకలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పూజలు, పంచాంగ శ్రవణం వంటి సంప్రదాయ కార్యక్రమాలు జరుగనున్నాయని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -