వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకుసాగుతున్నారు ఏపీ సీఎం జగన్. వైనాట్ 175 పేరుతో గెలుపు గుర్రాలకే సీట్లు ఇస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇలా పెద్ద ఎత్తున సిట్టింగ్‌లను మారుస్తున్నారు. ఇందులో ఒక పార్లమెంట్ స్థానంతో 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంఛార్జులను ప్రకటించింది. చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ ఇంఛార్జ్ గా కె. నాారాయణస్వామిని నియమించగా ఎంపీగా ఉన్న రెడ్డప్ప పేరును జి.డి నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జ్ గా మార్చింది.
చిత్తూరు పార్లమెంట్ నుండి కె. నారాయణస్వామి, జి.డి నెల్లూరు – రెడ్డప్ప,శింగనమల – వీరాంజనేయులు,నందికొట్కూరు – డాక్టర్ సుధీర్ దారా,తిరువూరు – నల్లగట్ల స్వామిదాస్,మడకశిర – లక్కప్ప,కొవ్వూరు – తలారి వెంకట్రావు,గోపాలపురం – తానేటి వనిత,కనిగిరి – నారాయణ యాదవ్ పేర్లు ప్రకటించారు.
ఇప్పటికే మూడు జాబితాల్లో 50 అసెంబ్లీ, 9 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో టీడీపీ నుండి వచ్చిన కేశినేని నానితో పాటు మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీ ఉన్నారు.
