- Advertisement -

వైసీపీ..డిజిటల్ బుక్!

- Advertisement -

కూటమి పాలన ఎలా ఉందో ప్రజలకు తెలుసని, వైసీపీ శ్రేణులను ఇబ్బంది పెట్టే వారికి భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని మరోసారి హెచ్చరించారు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్. వైసీపీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యనేతల సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా డిజిటల్ బుక్ యాప్‌ను ప్రారంభించారు జగన్‌. రెడ్ బుక్ పేరుతో వైసీపీ కేడర్ ను వేధిస్తున్నారని, వీరికి అండగా నిలిచేందుకు డిజిటల్ బుక్ తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలపైన ప్రజాపోరాటాలకు సిద్ధం కావాలని వైఎస్ జగన్ పార్టీ నేతలకు, శ్రేణులకు పిలుపునిచ్చారు.

కూటమి ప్రభుత్వంలో వేధింపులు, అన్యాయానికి గురవుతున్న వారు ఫిర్యాదు చేసేందుకు క్యూఆర్ కోడ్ తో పాటుగా ప్రత్యేకంగా ఫోన్ నెంబర్ కేటాయించడం జరిగిందని అన్నారు. ఇక నుంచి పార్టీ కార్యకర్తలు ఎవరు ఇబ్బంది పడుతున్నా దీని ద్వారా పార్టీ నాయకత్వానికి సమాచారం ఇవ్వాలని జగన్ సూచించారు. కార్యకర్తలను వేధించిన వారిని వదిలిపెట్టేది లేదని జగన్ స్పష్టం చేశారు. పార్టీలోని అన్ని కమిటీలను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని జగన్ నిర్దేశించినట్లు తెలిసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -