- Advertisement -

17న వైసీపీ ఏపీ వ్యాప్త నిరసన!

- Advertisement -

పేరెంట్‌ టీచర్స్‌ మీట్ మా ప్రభుత్వ హయాంలో ఏడాదికి మూడు సార్లు పెట్టాం… ఇవాళ చంద్రబాబు కొత్తగా ఏమీ పెట్టలేదన్నారు బొత్స సత్యనారాయణ. మీడియాతో మాట్లాడిన శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ..నాడు నేడు ద్వారా వైఎస్ జగన్ బాగు చేసిన స్కూళ్లను మరోసారి ప్రజలకు చూపించినందుకు చంద్రబాబుకు ధన్యవాదాలు.. నాడు నేడులో గత ప్రభుత్వం ఏమీ చేయలేదని విమర్శించిన టీడీపీకి చంద్రబాబు మీటింగ్ తో సమాధానం దొరికినట్టేనన్నారు.

దేశంలోనే అత్యుత్తమ దర్యాప్తు సంస్థలు కూడా మేనేజ్‌ అవుతున్నాయని విశాఖ అంశంలో స్పష్టం అయింది.. దీనివల్ల విశాఖపట్నం నుంచి డ్రగ్స్‌ ఎగుమతి అనే మచ్చ పడిందన్నారు. ఇప్పుడు అదే సీబీఐ డ్రగ్స్‌ లేవని నివేదిక ఇచ్చింది. ఇది రాజకీయ దురుద్దేశంతో చేసిన ఆరోపణలా అనేది తేల్చాలన్నారు. తప్పుడు ఆరోపణలకు కారణమైన సీబీఐ అధికారులపై కేంద్రం తప్పకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

ప్రభుత్వ విధానాలు సవ్యంగా లేకపోవడంతో రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ఈ కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని ఎలుగెత్తి చెప్పేందుకు రైతుల ధాన్యం కొనుగోళ్లు చేయాలని, దళారీ వ్యవస్థను లేకుండా చేయాలని, మద్దతుధర కల్పించాలని, పంట బీమా పునురుద్ధరించాలని కోరుతూ వైయస్ఆర్ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ నెల 13న రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేయనుంది. కరెంట్ ఛార్జీల పెంపును నిరసిస్తూ ప్రజలపై వేసిన 15వేల కోట్ల విద్యుత్ భారాన్ని ప్రభుత్వమే భరించాలని కోరుతూ ఈనెల 17న రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయనున్నాం. జనవరి 3వ తేదీన ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై పోరాటం చేయబోతున్నాం అని చెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -