Sunday, May 19, 2024
- Advertisement -

షర్మిల,దాడి రాజీనామాపై వైవీ

- Advertisement -

వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరికకు ముహుర్తం ఫిక్సైన సంగతి తెలిసిందే. ఈ నెల 4న తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయనున్నారు షర్మిల. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్, ప్రియాంక గాంధీ సమక్షంలో పార్టీలో చేరనుండగా ఏపీసీసీ చీఫ్ లేదా ఏఐసీసీ సెక్రటరీ పదవి ఇచ్చే అవకాశం ఉందని తన అనుచరులకు తెలిపారు షర్మిల.

ఈ నేపథ్యంలో షర్మిల కాంగ్రెస్‌లో చేరికపై స్పందించారు వైసీపీ ఉత్తరాంధ్ర వ్యవహారాల ఇంఛార్జీ వైవీ సుబ్బారెడ్డి. తెలంగాణ ఎన్నికల సమయంలోనే షర్మిల కాంగ్రెస్ లో చేరతారని ప్రచారం జరిగిందని… ఎవరు ఏ పార్టీలో చేరినా వైసీపీకి ఎలాంటి ఇబ్బంది లేదని తేల్చి చెప్పారు. విజయమ్మను కలిసేందుకే తాను హైదరాబాద్ వెళ్లానని షర్మిలతో ఎలాంటి రాయబారాలు చేయలేదన్నారు. కుటుంబ సభ్యులను కలవడం కూడా తప్పంటే ఎలా అని ప్రశ్నించారు.

ఎన్నికల సమయంలో సీట్ల మార్పు సహజం అని..కొంతమంది వ్యక్తిగత కారణాలతోనే పార్టీని వీడి వెళ్తున్నారని తెలిపారు. టికెట్ రాని వారికి వైసీపీ అధికారంలోకి వచ్చాక తప్పకుండా అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. నేతలు పార్టీని వీడినంత మాత్రాన బాధలేదని ప్రజలంతా జగన్‌తోనే ఉన్నారన్నారు. జగన్ చేసిన సంక్షేమ కార్యక్రమాలే వైసీపీని గెలిపిస్తాయని…. డాడి వీరభద్రరావుకి టికెట్ ఇచ్చే పరిస్థితి లేదని..అందుకే ఆయన రాజీనామా చేసి ఉండొచ్చన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -