Sunday, May 19, 2024
- Advertisement -

హనుమాన్ దెబ్బకు మహేష్ ఔట్!

- Advertisement -

సంక్రాంతి రేసులో తొలిగా వచ్చిన సినిమాలు మహేష్ బాబు గుంటూరు కారం, తేజ సజ్జా హనుమాన్. ఒకేరోజు ఈ రెండు సినిమాలు రిలీజ్ కాగా బాక్సాఫీస్ వద్ద సత్తాచాటాయి. అయితే తొలుత హనుమాన్‌కు ఎక్కువ థియేటర్లు ఇవ్వకపోవడంతో గుంటూరు కారం వసూళ్ల సునామీ సృష్టించింది. అయితే తర్వాత హనుమాన్ థియేటర్లు పెరగడంతో గుంటూరు కారం వసూళ్లు తగ్గుతూ వచ్చాయి. 10 రోజుల్లోనే హనుమాన్ రూ.200 కోట్ల వసూళ్లను దాటేసింది.

ఇక 11వ రోజు దేశవ్యాప్తంగా రూ.7.5 కోట్లు వసూలు చేసింది. తెలుగులోనే రూ.5.25 కోట్లు రాగా హిందీలో మరో రూ.2.25 కోట్లు రాబట్టింది. మరోవైపు గుంటూరు కారం కలెక్షన్లు మాత్రం రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. 10 రోజుల్లో రూ.194.98 కోట్లు వసూలు చేయగా 11వ రోజు ఈ మూవీ కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి.

గుంటూరు కారం ఆక్యుపెన్సీ 18.49 శాతానికి పరిమితంకాగా హనుమాన్ ఆక్యుపెన్సీ మాత్రం రూ.40.09 గా ఉండటం విశేషం. ఇక హిందీలోనూ హనుమాన్ ఆక్యుపెన్సీ 15.13 శాతంగా ఉంది. మొత్తంగా చిన్న సినిమా హనుమాన్ ముందు గుంటూరు కారం దెబ్బతినిందనే చెప్పాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -