Wednesday, May 22, 2024
- Advertisement -

ఓటింగ్ యంత్రాల ట్యాంప‌రింగ్ ఆరోప‌న‌ల‌కు చెక్  పెట్ట‌నున్న ఈసీ

- Advertisement -
2019 Election: All New VVPAT Machines

ఎలాక్ట్రానిక్   ఓటింగ్ యంత్రాల‌పై దేశ వ్యాప్తంగా ఎంత సంచ‌ల‌నం రేకిత్తించిందో అద‌ర‌కీ తెలిసిందే. దీనిపై అన్ని జాతీయ పార్టీలు ఈసీ పిర్యాదు చేశాయి. దీన‌కంత‌టికి కారనం  యూపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో బీజీపీ పార్టీ అతిపెద్ద  పార్టీగా అవ‌త‌రించింది.

దీనిపై బీఎస్‌పీ అధినేత మాయ‌వ‌తి ఓటింగ్ యంత్రాల‌ను ట్యాంప‌రింగ్ చేశార‌ని …. ఏబ‌ట‌న్ నొక్కినా అది బీజేపీ కే  ఓటు ప‌డింద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మాయ‌వతికితోడు మిగితా పార్టీలు కూడా ఓటింగ్ యంత్రాల‌పై అనుమానం వ్య‌క్తంచేయ‌డంతోపాటు ఈసీ కి పిర్యాదు చేశారు.. ప్ర‌ధానంగా  ఢిల్లీ ముఖ్య‌మంత్రి ఆర‌వింద్ కేజ్రీవాల్ దీనిపై తీవ్ర విమ‌ర్శ‌లు చేయ‌డ‌తో ఈసీ కూడా స్పందించింది.అయితే ఈసీ వీరి వాద‌న‌ను తోసిపుచ్చింది.క‌వాల్సింటే వీటిని ఎవ‌రైనా తీసుకొని ట్యాంప‌రింగ్ చేయాల‌ని స‌వాల్ విసిరింది.

అయితే ఓటింగు మిషన్లను ట్యాంపరింగ్ చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఇక ఎలాంటి అనుమానాలు తలెత్తని విధానం అందుబాటులోతీసుకొచ్చేంద‌కు ఈసీ కూడా సిద్దంగా ఉంది. తాను వేసిన ఓటు ఎవరికి పడిందో ఓటరు ధ్రువీకరించుకునేందుకు అవకాశం కల్పించే వీవీపీఏటీ వ్యవస్థను 2019 సార్వత్రిక ఎన్నికల నుంచి అమలులోకి తేవాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది.

దాదాపు ఏడేండ్లుగా నలుగుతూ వస్తున్న వీవీపీఏటీ (ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్) విధానంపై ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సంఘం ప్రతిపాదనకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన ఢిల్లీలో బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. ఓటరుకు తాను ఎవరికి ఓటేసింది డిస్‌ప్లే ద్వారా తెలిసిపోతోంది. రసీదు భద్రంగా డబ్బాలో పడిపోతుంది. ఈ విధానాన్ని 2019 సార్వత్రిక ఎన్నికల్లో అమలుచేయనున్నారు. 

అయితే ఓటరు ఏ అభ్యర్థికి ఓటేసింది తెలుసుకునే అవకాశం లేకుండా పోయింది. దీంతో అనేక రాజకీయ పార్టీలకు ఈవీఎంల వినియోగంపై అనుమానాలు తలెత్తాయి. వీటిని దృష్టిలో పెట్టుకున్న కేంద్ర ఎన్నికల సంఘం 2010 అక్టోబర్ 4న ఢిల్లీలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించి ఎన్నికల నిర్వహణలో పారదర్శకతను పెంపొందించడంపై చర్చించింది. ఓటరు ఎవరికి ఓటు వేశారో తెలుసుకునే అవకాశాన్ని కల్పించాలన్న అభిప్రాయం వ్యక్తం కావడంతో అప్పుడే వీవీపీఏటీ విధానానికి అంకురార్పణ జరిగింది. ఎన్నికల కమిషన్ 2013 ఫిబ్రవరి 9న ప్రయోగాత్మకంగా రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఓటర్లు, స్వచ్ఛంద సంస్థలు, మీడియా ప్రతినిధుల సమక్షంలో తిరువనంతపురం, ఢిల్లీ, జైసల్మేర్, చిరపుంజి, లే ప్రాంతాల్లో వీవీపీఏటీ యంత్రాలను పరిశీలించి చూసింది. ఫలితాలు సంతృప్తికరంగా ఉండటంతో ఎన్నికల నియమావళి చట్టానికి 2013 ఆగస్టు 14న సవరణ చేపట్టారు. 

ఆయితే ఆ తర్వాత సుబ్రమణ్యస్వామి ఈవీఎంల నాణ్యతపైనా, నిజాయితీపైనా సందేహాలను లేవనెత్తుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఓటరు ఎవరికి ఓటువేస్తే వారికే పడిందా లేదా నివృత్తి చేసుకోడానికి ఒక వ్యవస్థ ఉండాలని, ఎన్నికల నిర్వహణలో పారదర్శకతకు తగిన ప్రాధాన్యం ఉండాలని కోరారు. ఎన్నికల సంఘం దశలవారీగా వీవీపీఏటీ వ్యవస్థను వినియోగంలోకి తేవాలని, ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం తగిన ఆర్థిక సాయాన్ని చేయాలని సుప్రీంకోర్టు 2013 అక్టోబర్ 8న ఆదేశించింది. 

వీవీపీఏటీ యంత్రాలను వినియోగించడం ద్వారా ఓటరు తన ఓటు ఎవరికి పడుతున్నదో నిర్ధారించుకోవచ్చు. ఈవీఎం యంత్రంపై తాను కోరుకున్న అభ్యర్థికి సంబంధించిన బటన్‌ను ప్రెస్ చేయగానే వీవీపీఏటీ యంత్రంపై ఉండే డిస్‌ప్లేలో ఆ అభ్యర్థి వివరాలు ఏడు సెకండ్లపాటు కనిపిస్తాయి. ఆ తర్వాత ఓటరు పేరు, సీరియల్ నంబర్, ఏ అభ్యర్థికి ఓటుపడిందో తెలియజేసే వివరాలతో కూడిన ఒక స్లిప్ ఆ యంత్రానికి అనుసంధానం చేసిన డబ్బాలో పడిపోతుంది. ఒకవేళ ఓటరు తాను వేసిన ఓటు తాను కోరుకున్న అభ్యర్థికి బదులుగా మరొకరికి పడినట్లు డిస్‌ప్లే ద్వారా గమనించినట్లయితే ఆ లోపాన్ని సదరు పోలింగ్ బూత్‌లోని ఎన్నికల అధికారికి తెలియజేయాల్సి ఉంటుంది.

ఓట్ల లెక్కింపు సమయంలో ఇలాంటి అభ్యంతరాలను, ఫిర్యాదులను ఎన్నికల సిబ్బంది పరిగణనలోకి తీసుకుంటారు. అవసరాన్ని బట్టి ఆ స్లిప్‌ను తనిఖీ చేస్తారు. అయితే ఈ స్లిప్ అటు ఓటర్‌కుగానీ, ఇటు ఎన్నికల సిబ్బందికిగానీ అందుబాటులో ఉండదు. ఫిర్యాదులకు అనుగుణంగా తగిన అనుమతి పొందిన తర్వాతనే పరిశీలనకు తీయాల్సి ఉంటుంది.ఈ విధానం అమ‌ల్లోకి వ‌స్తే ఓటు వేసే విధానంలో మ‌రింత పార‌ద‌ర్శ‌కంగా ఉంటుంది.ఇక ఏపార్టీకీ ఎటువంటి అనుమానాలు త‌లెత్త‌కుండా ఉంటాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -