Sunday, May 19, 2024
- Advertisement -

త‌మ విమానాల్లో ప్ర‌యానించ‌కుండా జేసీపై నిషేధంవిధించిన విమాన సంస్థ‌లు

- Advertisement -
7 airlines bar TDP’s MP JC Diwakar Reddy

విశాఖపట్నం విమానాశ్రయంలో ఇండిగో విమానాశ్రయ సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించిన అనంతపురం తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి భారీ షాక్ త‌గిలింది. ఎంపీ అన్న అహంకారంతో అక్క‌డి సిబ్బందిపై దురుసుగా ప్ర‌వ‌ర్థించి జేసీలో ఎయిర్ ఇండియా, ఇండిగో విమానయాన సంస్థలు నిషేధం విధించాయి.

గతంలో ఎయిరిండియా సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించినందుకు గాను శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌పైనా ఇలాంటి నిషేధాన్నే విమానయాన సంస్థలు విధించాయి.

{loadmodule mod_custom,GA1}

ఎంపీ రామ్మోహన్‌నాయుడు వివాహానికి హాజరయ్యేందుకు వచ్చిన జేసీ దివాకర్ రెడ్డి ఇండిగో విమానంలో వెళ్లేందుకు విశాఖ ఎయిర్‌పోర్టుకు వచ్చారు. విమానం ఉదయం 7. 55 నిమిషాలకు బయలుదేరాల్సి ఉంది. 7.30కు విమానాశ్రయానికి వచ్చిన జేసీ బోర్డింగ్ పాస్ ఇవ్వాలని సిబ్బందిని కోరారు. కానీ విమానం బయలుదేరడానికి 45 నిమిషాల ముందే బోర్డింగ్ పాసులు ఇచ్చేశామని.. ఆ తర్వాత వచ్చిన వారికి ఇవ్వడానికి నిబంధనలు ఒప్పుకోవని సిబ్బంది చెప్పారు. దీంతో ఎంపీ జేసీకి కోపం వచ్చి సిబ్బందిపై ఊగిపోయారు.నాకే రూల్స్ చెబుతారా.. ఎవర్రా మీరు అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. కౌంటర్‌లోకి చొరబడి బోర్డింగ్ పాస్‌ యంత్రాన్ని పగలగొట్టారు. సిబ్బందిపై తిట్ల దండకం అందుకున్నారు. ఇదంతా సీసీ కెమెరాల్లో రికార్డు అయింది.

{loadmodule mod_custom,GA2}

కాగా, గురువారం ఉదయం అధికారులతో జేసీ దివాకర్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. తనకు బోర్డింగ్ పాస్ ఇవ్వాలని మండిపడ్డారు. దీంతో వారు ఇవ్వడం కుదరదని చెప్పారు. దీంతో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు కల్పించుకొని ఆయనకు బోర్డింగ్ పాస్ ఇప్పించారని తెలుస్తోంది.అయితే దీనిపై చంద్ర‌బాబు సీరియ‌స్‌గా ఉన్న‌ట్లు తెలుస్తోంది. విమానాలు ఏమ‌న్న త‌న సొంత ట్రావెల్ బ‌స్సులు అనుకున్నారేమో …. ఏం మాట్లాడినా చెల్లుతుంది అనుకున్నారేమో …మ‌రీ రెచ్చిపోయారు.

{loadmodule mod_sp_social,Follow Us}
{youtube}7YDJlJZBhfI{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -