- Advertisement -
ఛత్తీస్‌గడ్‌లోని బిలాస్‌పూర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తాక్తాపూర్ గ్రామంలో శనివారం కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స నిర్వహించారు. శిబిరంలో 80మందికి పైగా మహిళలకు కుటుంబనియంత్రణ శస్త్రచికిత్సలు నిర్వహిస్తే.. శస్త్రచికిత్సలు చేయించుకున్న వారిలో 8మంది మృతి చెందగా, మరో 15మంది పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
వైద్యశాఖమంత్రి అమర్ అగర్వాల్ సొంతజిల్లాలోనే ఈఘటన జరిగింది. ఘటనపై స్పందించిన ప్రభుత్వం 3గురు సభ్యులతో కూడిన విచారణా కమిటిని నియమించింది.చత్తీస్‌ఘడ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ మృతులకుటుంబాలకు 2లక్షలు, పరిస్థితి విషమంగా ఉన్నవారి కుటుంబాలకు 50వేలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.
