Tuesday, May 14, 2024
- Advertisement -

జ‌గ‌న్‌పై దుస్ప్ర‌చారానికి మ‌రో సారి తెర‌లేపిన టీడీపీ ప‌చ్చ‌మీడియా..

- Advertisement -

కేంద్రంపై అవిశ్వాసం తీర్మానం నేప‌థ్యంలో ఢిల్లీలో కీల‌క ప‌రిణామాలు చోటు చేస‌కుంటున్నాయి. రాజ‌కీయాలు ఎప్ప‌టి క‌ప్ప‌డు వేగంగా మారిపోతున్నాయి. తాజాగా రాష్ట్ర భాజాపా నేత‌ల‌తో ఛీఫ్ అమీత్‌షా స‌మావేశ మ‌య్యారు. స‌మావేశంలో టీడీపీని ఎండ‌గ‌ట్టాల‌ని నేత‌ల‌కు సూచించారు.

ఈసంద‌ర్భంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను వైసీపీ అధినేత జగన్ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కలిశార‌నే వార్త‌లు గుప్పుమ‌న్నాయి. ఇదంతా ఒక్క ఎత్త‌యితే జ‌గ‌న్‌ను దెబ్బ‌తీసేందుకు అప్పుడే బాబు ప‌చ్చ‌మీడియా రాజ‌కీయాలు మొద‌లు పెట్టింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను వైసీపీ అధినేత జగన్ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కలిశార‌నే దుస్ప్ర‌చారానికి తెర‌లేపింది. అస‌లు ప్ర‌శాంత్ కిషోర్ ఢిల్లీలోనే లేడ‌ని తెలుస్తోంది.

ప్ర‌శాంత్ కిషోర్ వైసీపీ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెల‌సిందే. భాజాపాతో టీడీపీతో తెగ‌దెంపులు చేసుకోవ‌డంతో రాజ‌కీయాలు ఊపందుకున్నాయి. ప్ర‌శాంత్ కిషోర్ అమిత్‌షా భేటీకీ హాజ‌ర‌య్యార‌ని దాన్ని షాకుగా తీసుకొని జ‌గ‌న్ భాజాపాతో క‌లిశాడ‌నే వార్త‌ల‌కు తెర‌లేపింది టీడీపీ ఆస్థాన మీడియా.

వాస్త‌వంగా చూసుకుంటే ప్ర‌శాంత్ కిషోర్ ఢిల్లీలో లేడు. అమితీషా స‌మావేశానికి హ‌జ‌రు కాలేదు. కాని అస్థాన ప‌చ్చ‌మీడియా మాత్రం అత్యూత్సాహం ప్ర‌ద‌ర్శించి స‌మావేశానికి ప్ర‌శాంత్ కిషోర్ హాజ‌ర‌య్యార‌ని బ్రేకింగ్‌ల మీద బ్రేకింగ్‌లు ఇస్తోంది. కాని పీకే అస‌లు ఢిల్లీలోనే లేక‌పోవ‌డంతో అడ్డంగా మ‌రోసారి దొరికిపోయింది ప‌చ్చ‌మీడియా.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -