Saturday, May 4, 2024
- Advertisement -

నా ఫొటోలు తీయొద్దు

- Advertisement -
  • మీడియా ముందు ఏడ్చేసిన ఐష్‌

    అందాల తార ఐశ్వ‌ర్య‌రాయ్ ఒక్క‌సారిగా క‌న్నీళ్లు పెట్టేసుకుంది. భావోద్వేగానికి లోనై మీడియా ముందే క‌న్నీళ్లు పెట్టుకోవ‌డం అంద‌ర్నీ క‌ల‌చివేసింది. ఫొటోగ్రాఫ‌ర్ల అత్యుత్సాహాంతో ఆమె అస‌హ‌నానికి గురై ఇబ్బందుల‌కు గుర‌య్యింది. వారిపై ఆగ్ర‌హాం వ్య‌క్తం చేస్తూ ఏం చేయాలో తెలియ‌క బాధ‌ప‌డిపోయింది. అస‌లేం జ‌రిగిందేంటంటే సోమ‌వారం త‌న తండ్రి కృష్ణ‌రాజ్‌రాయ్ జ‌యంతి. ఆయ‌న జ‌యంతి సంద‌ర్భంగా స్మైల్ ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో ఐష్ గ్ర‌హణం మొర్రి చిన్నారుల‌కు శ‌స్ర్త‌చికిత్స చేయించేందుకు నిర్ణ‌యించుకుంది.

ఆ సంద‌ర్భంగా ముంబైలోని ఓ ఆస్ప‌త్రిలో గ్ర‌హణం మొర్రి చిన్నారుల‌కు శ‌స్ర్త‌చికిత్స చేసే కార్య‌క్ర‌మానికి ఆమె హాజ‌ర‌య్యారు. ఈ విష‌యం తెలుసుకున్న మీడియా వాళ్లు టక్‌ట‌క్‌మంటూ కెమెరాల‌తో ఫొటోల వ‌ర్షం కురిపించారు. ఆ ఫ్లాష్‌ల వెలుగులో ఐశ్వ‌ర్యారాయ్ ఇబ్బందికి గుర‌య్యారు.పైగా ఓ సామాజిక సేవ కార్య‌క్ర‌మానికి వ‌స్తే ఇలా ఫొటోలు తీయ‌డం త‌న‌కు న‌చ్చ‌లేదు. ప్లీజ్ ఫొటోలు తీయ‌కండి. ‘ప్లీజ్‌ నా ఫొటోలు తీయకండి. నేను ఏ పని కోసం ఇక్కడికి వచ్చానో మీకు తెలీదు. ఇది సినిమా ప్రీమియర్‌ షో కాదు. పబ్లిక్‌ ఈవెంట్‌ అంతకన్నా కాదు. అసలు మీరెందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు’ అంటూ ఐష్‌ కన్నీరుపెట్టుకున్నారు.

ఐశ్వ‌ర్య‌రాయ్ తండ్రి కృష్ణారాజ్‌ రాయ్ ఇటీవ‌ల అనారోగ్యంతో మృతిచెందాడు. త‌న తండ్రి గ్ర‌హ‌ణంమొర్రితో జ‌న్మించాడు. దీంతో స్వ‌చ్ఛందంగా 2011లో వంద‌ మంది గ్ర‌హ‌ణం మొర్రితో బాధ‌ప‌డే చిన్నారులకు ఉచితంగా సర్జరీ చేయించారు. తన తండ్రి మాదిరి వంద మందికి గ్ర‌హ‌ణంమొర్రి చిన్నారుల‌కు శ‌స్ర్త‌చికిత్స చేయించాల‌ని నిర్ణ‌యించారు. ఆ కార్య‌క్ర‌మంలో భాగంగా ఆ చిన్నారుల‌తో కేక్ క‌ట్ చేయించాల‌ని చూడ‌గా ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -