Sunday, May 19, 2024
- Advertisement -

అమ్మ కుర్చీ పెట్టుకుని తమిళనాడు లో పాలన !

- Advertisement -
Amma Jayalalitha chair in AIADMK Meet tamilnadu

అమ్మగా తమిళ నేతల మనసులలో ఎప్పటికీ ఉండిపోయ్యే పేరు జయలలితడే. ఎందఱో అధినేతలు తమిళనాడు కి సూపర్ లీడర్ షిప్ అందించినా కూడా అమ్మ వారికి ఇచ్చిన ప్రేమని వారు ఎప్పటికీ మరచిపోలేరు.

ప్రధానమంత్రితో భేటీ అయినా.. తాను కూర్చునే కుర్చీలోనే కూర్చునేవారు తప్పించి.. ఎవరో వేసిన కుర్చీలో కూర్చునేందుకు ససేమిరా అనేవారు. అలాంటి వెరైటీలు అమ్మ దగ్గర చాలానే ఉంటాయి. మరి.. అమ్మ లేని ఇప్పుడు.. అమ్మ ఎంతో అభిమానంగా చూసుకున్న ఆ కుర్చీ మాటేమిటి? అన్న సందేహానికి తాజాగా సమాధానం లభించింది. గురువారం జరిగిన అన్నాడీఎంకే కార్యవర్గ సమావేశం సందర్భంగా అమ్మ స్థానం అమ్మదేనన్న విషయాన్ని స్పష్టం చేసేలా ఏర్పాట్లు చేశారు. వేదిక మధ్యలో అమ్మ కుర్చునే కుర్చీని ఏర్పాటు చేసి.. అందులో అమ్మ ఫోటోను పెట్టి.. పూలదండలతో అలంకరించారు.

కుర్చీకి చెరోవైపు ముఖ్యనేతలు కూర్చునే ఏర్పాటు చేశారు. ఇదంతా చూసినప్పుడు.. అమ్మ బతికి ఉన్నప్పుడు.. పార్టీ సమావేశాల్ని తన కనుసన్నల్లో ఎలా నిర్వహించారో.. ఇంచుమించు అదే రీతిలో నిర్వహించారని చెప్పాలి. అమ్మ లేకున్నా.. అమ్మ స్థానాన్ని భర్తీ చేసేలా.. ఆమె కుర్చీ వ్యవహరించిందని చెప్పక తప్పదు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -