- Advertisement -

నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలపై ఘాటుగా స్పందించిన రంగమ్మత్త

- Advertisement -

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను కలుపుతూ వేల ఎకరాల్లో విస్తరించిన నల్లమల అడవుల్లోని యురేనియం తవ్వకాలకు కేంద్రం అనుమతులు ఇవ్వడంతో దానికి వ్యతిరేకంగా ఉద్యమం ఊపందుకుంటోంది. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ఉద్యమాలు జరగుుతన్నాయి. పవన్ కూడా దీనిపై స్పందించిన సంగతి తెలిసిందే.

రాజకీయ పార్టీలతోపాటు మైనింగ్‌కు వ్యతిరేకంగా పెద్దఎత్తున ఉద్యామాలు జరుగుతున్నాయి. పర్యావరణ వేత్తలతో పాటు సినీ ప్రముఖులు కూడా ఈ పరిణామాలపై తమ గళం వినిపిస్తున్నారు.ఇప్పటికే దర్శకుడు శేఖర్‌ కమ్ముల సేవ్‌ నల్లమల క్యాంపెయిన్‌కు తన మద్దతు తెలపగా తాజాగా హీరో విజయ్ దేవరకొండ కూడా మద్దతు తెలిపారు.

ప్రముఖ యాంకర్, సినీ నటి అనసూయ భరద్వాజ్ కూడా ఈ అంశంపై స్పందించారు. నల్లమలలో రేడియో ధార్మిక యురేనియం తవ్వకాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతించడం ద్వారా అనేక అనర్థాలు చోటుచేసుకుంటాయని ఆమె ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు పెట్టారు.యురేనియం తవ్వకాల కోసం తెలుగు రాష్ట్రాల్లో చాలా భాగం అడవి నరికివేతకు గురవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్కసారి ఆ భూమి అణు ప్రభావానికి గురైతే అక్కడ గడ్డిపోచ కూడా మొలవదని, భూసారం క్షీణించిపోతుందని తెలిపారు. పులుల సంరక్షణ ప్రాంతం కూడా నాశనం అవుతుందని హెచ్చరించారు.

https://www.instagram.com/p/B2T0BrplNaW/?utm_source=ig_embed&utm_campaign=loading

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -