Thursday, May 16, 2024
- Advertisement -

అయోమయలో ఆంధ్రా జనాలు

- Advertisement -

కాల్ మనీ పేరుతో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అరాచకాలు.. మహా ఘోరాలు ఇన్నాళ్లూ విన్నాం.. మీడియాలో చూశాం. అధిక వడ్డీకి మహిళలకూ డబ్బులిచ్చి… ఆ అప్పు తీర్చలేని ఆడబిడ్డలను బలవంతంగా పడుపు వృత్తిలోకి దించి.. కొందరు దుర్మార్గులు చేసిన కిరాతకం తెలుసుకుని చాలా మంది ఆవేదన ఆపుకోలేకపోయాం. ఈ విషయంలో.. 2 ప్రధాన మీడియా సంస్థలు వడ్డిస్తున్న వార్తలు చదువుతూ.. ఇప్పుడు ఛీ అనుకుంటున్నాం.

2 ప్రధాన మీడియా సంస్థలు.. అధికార, ప్రతిపక్షాలకు అండగా ఉంటున్న ఆ మాధ్యమాలు.. ఎవరి వర్గానికి అవి అనుకూలంగా వార్తలు రాసేస్తున్నాయి. తమ వాళ్లను తప్పించేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో నిజం ఏంటో.. అబద్ధం ఏంటో సామాన్య జనానికి ఎంత మాత్రం తెలియదు. కానీ.. జరిగిన ఘోరం తెలుసుకుని అంతా ఆవేదన చెందుతున్నారు. వాస్తవాలు బయటపెట్టాల్సిన మీడియాలో.. రాజకీయ నేతలకు అనుకూలంగా వస్తున్న వార్తలు చూసి సిగ్గుపడుతున్నారు.

ఈ దుర్మార్గం వెనక అధికార పార్టీ నేతలున్నారా… విపక్ష నాయకులు ఉన్నారా అన్నది ప్రస్తుతానికి అప్రస్తుతం. కానీ.. ఇదే అవకాశంగా.. ఒకరిపై ఒకరు దుమ్మెత్తుకుని పోసుకుంటూ.. ‘ఆ రెండు’ మీడియాలు వార్తలు రాస్తున్న మాట నిజం. ఇన్నాళ్లూ ఓ మీడియా.. కాల్ మనీ వార్తలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న విమర్శలు వచ్చాయి. చివరికి రూట్ మార్చిన సదరు పత్రిక.. బ్యానర్ వార్తగా ఓ ఆర్టికల్ ఇచ్చింది. హెడ్ లైన్ చూసి అంతా అబ్బో అనుకున్నారు. కానీ.. మ్యాటర్ లోకి వెళ్లే సరికి అసలు విషయం అర్థం చేసుకున్నారు. వారి ప్రతికూల రాజకీయ నాయకులనే టార్గెట్ చేస్తూ ఆ వార్త రాశారని తెలుసుకుని మళ్లీ నిరాశపడ్డారు.

కానీ.. ఎవరు ఎంత నిరాశపడ్డా.. ఎవరు ఎంత ఆవేదనకు గురైనా… వాస్తవంలో మార్పు మాత్రం రాదని.. తమ అనుకూల రాజకీయ శక్తులకే మీడియా సంస్థలు అండగా వార్తలు రాస్తాయని.. జనానికి ఎప్పుడు అర్థమవుతుందో.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -