Thursday, May 16, 2024
- Advertisement -

జగన్ ఇచ్చే 3 ఎమ్మెల్సీలు వీళ్లకే.?

- Advertisement -

ఏపీలో ఖాళీ అయిన మూడు ఎమ్మెల్సీ పదవుల భర్తీకి ఎన్నికల కమిషన్ సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ మేరకు షెడ్యూల్ కూడా విడుదల చేసింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక వచ్చిన తొలి ఎమ్మెల్సీ ఎన్నికలు కావడంతో ఈ మూడు ఎవరికి దక్కుతాయనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

ప్రస్తుతం వైసీపీకి 151మంది ఎమ్మెల్యేల మద్దతుంది. పైగా అధికారంలో ఉంది. కొండంత ప్రజాబలం ఉంది. దీంతో ఆ మూడు ఎమ్మెల్సీ పదవులు వైసీపీ ఖాతాలోనే పడనున్నాయి.

ప్రస్తుతం ఈసీ ఎమ్మెల్యే కోటాలో ఈ మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనుంది. దీంతో 151మంది ఉన్న వైసీపీకే ఆ మూడు ఎమ్మెల్సీ స్థానాలు దక్కనున్నాయి. మరి ఈ మూడు స్థానాలను జగన్ ఎవరికి ఇస్తారనేది ప్రస్తుతం వైసీపీలో హాట్ టాపిక్ గా మారింది.

టీడీపీ నుంచి చీరాల ఎమ్మెల్యేగా గెలిచిన ఎమ్మెల్సీ కరణం బలరాం, వైసీపీ నుంచి ఏలూరు ఎమ్మెల్యేగా గెలిచిన ఆళ్ల నాని, విజయనగరం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన కొలగొట్ల వీరభద్రస్వామి తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. ఈ మూడు స్థానాలను ఎమ్మెల్యే కోటాలో భర్తీ చేయనున్నారు.

కాగా రేపల్లెలో ఓడినా మంత్రి పదవి చేపట్టిన మోపిదేవికి ఒక ఎమ్మెల్సీ సీటు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక బాలయ్యపై ఓడిన మైనార్టీ నేత ఇక్బాల్ కు ఎమ్మెల్సీ ఇస్తానని జగన్ వాగ్ధానం చేశారు. వీరే కాక వైసీపీలో చేరిన మాజీ ఎంపీ రవీంద్ర బాబు, రాజంపేట సీటు త్యాగం చేసిన మేకపాటి అమర్నాథ్ రెడ్డిలకు మిగతా రెండు సీట్లు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. జగన్ నిర్ణయమే అంతిమంగా ఫైనల్ కానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -