Tuesday, May 14, 2024
- Advertisement -

మేడా మ‌ల్లిఖార్జున్ రెడ్డి క‌న్‌ఫామ్‌.. మ‌రి అమ‌ర్నాథ్ రెడ్డి?

- Advertisement -

క‌డ‌ప జిల్లా రాజంపేట నియోజ‌క‌వ‌ర్గ వైఎస్ఆర్‌సీపీ అభ్య‌ర్థి ఎవ‌రో ఖ‌రారైన‌ట్టు తెలుస్తుంది. ఇప్ప‌టివ‌ర‌కు నియోజ‌క‌వ‌ర్గంలో వైఎస్ఆర్‌సీపీ త‌ర‌పున బ‌రిలోకి దిగే అభ్య‌ర్థి ఎవ‌ర‌న్న‌దానిపై అనిశ్చితి నెల‌కొంది. ముందునుంచి పార్టీలో కొన‌సాగిన అమ‌ర్నాథ్ రెడ్డికి సీటు కేటాయిస్తారా? లేక టీడీపీ నుంచి పార్టీలోకి వ‌చ్చిన మేడా మ‌ల్లిఖార్జున‌రెడ్డికి సీటు కేటాయిస్తారా? అన్న ప్ర‌శ్న ఇరువురు నేత‌ల‌తో పాటు కార్య‌క‌ర్త‌ల్లో కొంత ఆందోళ‌న‌ నెలకొని ఉండేది. దీనికి త‌గ్గ‌ట్టుగానే మేడా చేరిన కొన్ని రోజుల‌కే జ‌గ‌న్‌ను క‌లిసిన అమ‌ర్నాథ్ రెడ్డి.. తాను జ‌గ‌న్‌కు సేవ‌కుడిన‌ని.. మేడాకు కాదంటూ స్టేట్‌మెంట్ ఇచ్చారు. దీంతో మేడా చేరిక రాజంపేట‌లో లుక‌లుక‌లు తెచ్చింద‌న్న వార్త‌లు షికారు చేశాయి. దీంతో పార్టీ నేత‌లు ఇరువురు నేత‌ల మ‌ధ్య స‌యోధ్య కుద‌ర్చ‌డానికి ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు. మొత్తానికి వైఎస్ఆర్‌సీపీ నుంచి పోటీ ఎవ‌రు చేయ‌నున్నారో ఫైన‌ల్ చేశార‌ని తెలుస్తుంది. మేడాకే ఈ సారి పోటీ చేసుందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు స‌మాచారం.

మ‌రి ముందునుంచి పార్టీలోనే కొన‌సాగిన అమ‌ర్నాథ్ రెడ్డికి సంగ‌తేంట‌నే ప్ర‌శ్న‌లు తలెత్తాయ‌ట‌. కానీ అమ‌ర్నాథ్ రెడ్డికి కూడా పార్టీ భ‌రోసా ఇచ్చిన‌ట్టు తెలుస్తుంది. అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ స్థానంతో పాటు టీటీడీ ఛైర్మ‌న్ ప‌ద‌విని కూడా ఇస్తామ‌ని పార్టీ అధినేత హామీ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. ఇక త‌న కోసం సీటును త్యాగం చేసినందుకు మేడా కూడా అమ‌ర్నాథ్ రెడ్డికి భారీగానే బ‌హుమానాలు ముట్ట‌చెబుతున్న‌ట్టు స‌మాచారం. దీంతో మేడా గెలుపుకు కృషి చేస్తాన‌ని అమ‌ర్నాథ్ రెడ్డి హామీ ఇచ్చార‌ట‌.

ఏదేమైనా మొన్న‌టివ‌ర‌కు రాజంపేట‌లో అల‌క‌పాన్పు ఎక్కిన‌ అమ‌ర్నాథ్ రెడ్డి వ‌ర్గం మొత్తానికి స‌యోధ్య‌కు సై అన‌డంతో పార్టీలో కొత్త జోష్ వ‌చ్చింద‌ని స‌మాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -