ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అయేషా మీరా హత్య కేసు కీలక మలుపు తిరిగింది.కృష్ణాజిల్లా ఇబ్రహింపట్నంలో ఓ హాస్టల్ ఉంటు చదువుకుంటున్న అయేషా మీరా సడన్‌గా హత్యకు గురికాడం కలకలం సృష్టించింది.అప్పట్లో దర్యాప్తు చెపట్టిన పోలీసులు శ్యామ్ బాబు అనే వ్యక్తి ఈ హత్య చేశాడని నిర్థారణకు వచ్చారు. హైకోర్టు ఆదేశాల నేపధ్యంలో ఈ కేసు విచారణను చేపట్టిన సిబిఐ శ్యామ్ బాబు ఈ హత్య చేయలేదని తేల్చింది.
దీంతో అతడు నిర్థోషిగా బయటికి వచ్చాడు.ఈ కేసు బాధ్యతలను హైకోర్టు సిబిఐకి అప్పగించడంతో నిందితులను పట్టుకునే పనిలో పడింది సిబిఐ.ఈరోజు(శనివారం) సిబిఐ అధికారులు విజయవాడలో పర్యటించి ఈ కేసుకు సంబంధించిన వివిధ అంశాలపై దర్యాప్తు చేపట్టనున్నట్లు సమాచారం.సిబిఐ అధికారుల విజయవాడ పర్యటన విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. ప్రాథమిక విచారణ అనంతరం సిబిఐ ఈ కేసుపై ఎప్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేయనున్నట్లు తెలుస్తోంది.
- కన్నతల్లే.. కూతురిని కొట్టి చంపి..!
- ఫేస్బుక్ ప్రేమ.. పెళ్లి పేరుతో సహజీవనం.. చివరకు..
- మెగా డీఎస్సీ స్కామ్‌పై సీబీఐ విచారణ!
- ‘ధురంధర్’పై పవర్‌స్టార్ ఆసక్తికర వ్యాఖ్యలు
- రామ్ చరణ్ ‘పెద్ది’ ఊచకోత.. బిగ్గెస్ట్ రికార్డ్!
