Sunday, May 19, 2024
- Advertisement -

ఆ భయంతోనే రంగంలోకి దించారా?

- Advertisement -

ఏపీలో బాక్సైట్ తవ్వకాల వ్యవహారం రోజురోజుకూ రాజుకుంటోంది. ఈ విషయంలో జనం నుంచి తీవ్ర వ్యతిరేకత తప్పదన్న భయం.. అధికార పార్టీని వెంటాడుతున్నట్టు కనిపిస్తోంది. అదీ కాక.. జనం నుంచి వ్యతిరేకత ఇలా వచ్చీ రాగానే…ప్రత్యర్థి పక్షాలు టీడీపీపై విమర్శలు, వీధి ప్రదర్శనలతో దాడికి దిగే అవకాశాలు కూడా ఉన్నట్టు టీడీపీ నాయకత్వం అంచనా వేస్తోంది.

అందుకే ముందు జాగ్రత్తగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను.. తెలివిగా టీడీపీ రంగంలోకి దించిందన్న వార్తలు వినిపిస్తున్నాయి.ఈ మధ్యే.. ఏపీ సీఎం చంద్రబాబుతో పవన్ సమావేశమైనపుడు.. బాక్సైట్ తవ్వకాల వ్యవహారమే ఇద్దరి మధ్య ప్రధాన చర్చనీయాంశంగా తీవ్ర ప్రచారం జరిగింది. పవన్ కూడా అదే మాట చెప్పడంతో.. అప్పట్లో టీడీపీ వ్యూహం ఏంటో ఎవరికీ అర్థం కాలేదు.

పైగా.. జనం సమస్యలు తీరుస్తూనే… అందరూ ఒప్పుకుంటేనే తవ్వకాలు జరుగుతాయని బాబు కూడా చెప్పినట్టు వివరించారు.. జనసేన అధినేత. కానీ.. ఇప్పుడు జరుగుతున్న ప్రచారం ప్రకారం.. అసలు విషయం వేరే అని తెలుస్తోంది. అవసరమైతే కాస్త బలవంతంగానే తవ్వకాలు జరిపాలన్నది బాబు సర్కార్ వారి ఆలోచనగా ప్రచారం నడుస్తోంది. తీరా బాక్సైట్ తవ్వకాలు మొదలు పెట్టి.. జనం నుంచి వ్యతిరేకత వస్తే.. ఆ వ్యతిరేకతే ప్రత్యర్థులకు ఆయుధంగా మారితే.. అమ్మో తట్టుకోవడం కష్టం.

అదే ఆలోచన ఇప్పుడు టీడీపీ నాయకులను ఫాలో అవుతున్నట్టు టాక్. సర్కార్ పై విమర్శలతో విరుచుకుపడేందుకు మంచి చాన్స్ కోసం వెయిట్ చేస్తున్న వైసీపీ అధినేత జగన్, ఏపీ కాంగ్రెస్ చీఫ్ రఘువీరారెడ్డి కూడా ఇదే విషయంపై దృష్టి పెడుతున్నట్టు పొలిటికల్ సర్కిల్స్ అంటున్నాయి. ఇదంతా ముందే అంచనా వేసిన చంద్రబాబు.. తెలివిగా జనసేన అధ్యక్షుడు పవన్ ను స్క్రీన్ పైకి తీసుకొచ్చినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.

రాజధాని అమరావతికి భూ సమీకరణ వ్యవహారంలో కూడా ఇలాగే.. పవన్ జనం మధ్యలోకి వెళ్లి చేసిన పొలిటికల్ స్టంట్ అందరికీ తెలిసిందే కదా. ఆ విషయం వెనక కూడా బాబుగారే ఉన్నారన్న వార్త.. చాలా మంది నోట వినిపించింది. అదే నమ్మకంతో.. బాక్సైట్ వ్యవహారంలో పవన్ ను రంగంలోకి దించారంటూ.. పొలిటికల్ అనలిస్టులే కాదు. మామూలు జనాలు కూడా అనుకుంటున్నారు. ఇదే కనుక నిజమైతే.. బాబు ఎత్తు పారుతుందో.. చిత్తవుతుందో చూడాలని చాలా మంది వెయిట్ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -