Sunday, May 19, 2024
- Advertisement -

పవన్‌కు షాక్‌..జనసేనలో మొదలైన రాజీనామాలు!

- Advertisement -

ఏపీలో ముందస్తు ఎన్నికలు లేకపోయినా చంద్రబాబు అరెస్ట్ సానుభూతిని క్యాచ్ చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు టీడీపీ – జనసేన నేతలు. అయితే ఇప్పటివరకు బాగానే ఉన్నా ఈ రెండు పార్టీల పొత్తుతో అటు టీడీపీ ఇటు జనసేన నేతలు ఇద్దరు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఎందుకంటే పొత్తులో భాగంగా ఎవరికి సీటు దక్కుతుందో ఎవరికి దక్కదో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీలకు రాజీనామా చేసేందుకు పెద్ద ఎత్తున నేతలు సిద్ధమవుతున్నారు.

ఈ రెండు పార్టీల పొత్తులో ప్రధానంగా జనసేనకే తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే పొత్తులో టీడీపీ ఎన్ని సీట్లు కేటాయిస్తుందో తెలియని పరిస్థితి జనసేనది. ఇక జనసేన నేతలు 60కి పైగా సీట్లు ఆశీస్తుండగా 20 దాటి ఇచ్చే పరిస్థితిలో లేదు టీడీపీ. మరోవైపు జనసేన నుండి గెలుపు, ఓటముల సంగతి పక్కన పెడితే టికెట్లు ఆశిస్తున్న వారి జాబితా చాంతాడంత ఉంది. అందుకే పవన్ చేపట్టిన నాలుగో విడత వారాహి యాత్రలో కీలక నేతలు ఎవరు పాల్గొనడం లేదు.

ఇక జనసేన ఎక్కువ సీట్లు ఆశిస్తున్న తూర్పుగోదావరి జిల్లాల్లో పవన్ కు షాక్ తగిలింది. గతంలో రాజానగరం నియోజకవర్గ ఇన్‌ చార్జిగా పనిచేసిన మేడా గురుదత్త ప్రసాద్‌ సహా 100 మంది నేతలు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా వారు పవన్ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. పార్టీలో ఒంటెద్దు పోకడలు పెరిగిపోయాయని, అంతర్గత ప్రజాస్వామ్యం మచ్చుకైనా కనిపించడం లేదని పవన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక గురు దత్త బాటలోనే మరికొంతమంది నేతలు రాజీనామాకు సిద్ధంగా ఉండటంతో రానున్న రోజుల్లో జనసేనకు తీవ్ర ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -