Wednesday, May 15, 2024
- Advertisement -

ఇక్కడ కూడా 2 కళ్ల సిద్ధాంతమేనా?

- Advertisement -

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలపై.. ఆ రాష్ట్ర ఉద్యోగుల నుంచి భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ లో పని చేస్తున్న ఉద్యోగులంతా వచ్చే ఏడాది రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2 నాటికి విజయవాడకు వచ్చేయాల్సిందే అని.. చంద్రబాబు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చేశారు.

కుటుంబాన్ని, పిల్లల భవిష్యత్తును తలచుకుంటూ ఆందోళనలో ఉన్న కొందరు ప్రభుత్వ ఉద్యోగులు.. తమకు మినహాయింపులు ఇవ్వాలంటూ చాలా కాలంగా బాబు సర్కార్ ను వేడుకుంటున్నారు. అయినా సరే.. అంతా విజయవాడ రావాల్సిందే అన్నట్టుగా బాబు రూలింగ్ నడుస్తోంది. అయితే.. విజయవాడలో ఓ కార్యక్రమానికి హాజరైన చంద్రబాబు.. అక్కడి పరిస్థితులపై మాట్లాడారు.

భూముల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని.. అద్దెలు సామాన్యులు భరించలేని స్థాయికి చేరాయని అన్నారు. అక్కడితో ఆగకుండా.. హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చేందుకు.. ఈ ధరలను చూసే ఉద్యోగులు భయపడుతున్నారనీ సెలవిచ్చారు. బాబు కామెంట్ల గురించి తెలుసుకున్న కొందరు ఉద్యోగులు.. డిఫరెంట్ గా రియాక్ట్ అయ్యారు.

ధరల గురించి అన్నీ తెలిసిన చంద్రబాబే.. ఇలా తమను విజయవాడకు వచ్చేయాలని ఆదేశించడం ఎంత వరకు కరెక్టని ఇంటర్నల్ గా కామెంట్ చేస్తున్నారు. సమస్యల గురించి తెలిసినా.. వాటి పరిష్కారానికి కచ్చితమైన చర్యలు ఏం తీసుకుంటారో చెప్పని ప్రభుత్వం.. వెంటనే విజయవాడ వచ్చేయాలని అడగడం కూడా కరెక్టో కాదో ఆలోచిస్తే మంచిదంటున్నారు.

రాజకీయాల్లో అయితే.. 2 కళ్ల సిద్ధాంతం పనికి రావొచ్చేమో కానీ.. ఉద్యోగులు, వారి కుటుంబాల విషయంలో కూడా అదే సిద్ధాంతాన్ని అమలు చేస్తామంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -