Monday, April 29, 2024
- Advertisement -

కొత్త ఉద్యోగులకు ప్రముఖ ఐటీ కంపెనీ షాక్..!

- Advertisement -

గత కొంత కాలంగా ఐటీ రంగం సంక్షోభంలో ఉంది. అంతర్జాతీయ టెక్ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. సరిగా ప్రాజెక్టులు లేక.. మరోవైపు ఆర్థిక మాంద్యం భయాలతో కంపెనీలు.. ఖర్చులను తగ్గించుకునేందుకు తీవ్ర ఒడుదొడుకులను ఎదుర్కొంటోంది. ఇప్పుడు దిగ్గజ ఐటీ కంపెనీ టీసీఎస్ ఇదే రీతిలో ఉద్యోగులకు షాక్ ఇచ్చింది.

కొత్త రిక్రూట్మెంట్ లో భాగంగా ఉద్యోగులకు వచ్చే నెలలో మొదటి వారంలో జాయినింగ్ లెటర్లు జారిచేసింది. కానీ ఇప్పుడు వారందరికీ జాయినింగ్ తేదీలు మార్చుతూ కొత్త లెటర్లు పంపిస్తున్నట్టు సమాచారం. బడ్జెట్ లేకపోవడమే కారణం అంటున్నారు. 50 రోజుల తర్వాత తేదీలు మార్చి జాయినింగ్ లెటర్ పంపిస్తున్నట్టు సమాచారం. దీనిపై టీసీఎస్ నుంచి అఫీషియల్ గా ఎటువంటి సమాచారం లేదు. అయితే ఉద్యోగులలో జోరుగా చర్చ జరుగుతున్నట్లు సమాచారం.

ప్రాజెక్టులు తగ్గిపోయాయి, క్లయింట్స్ లేక ఐటీ రంగం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. దీంతో ఖర్చులను తగ్గించుకునే పనిలో పడ్డాయి దిగ్గజ ఐటీ కంపెనీలు. ఆఫర్ లెటర్స్ ఇచ్చి చేర్చుకోవడంలో జాప్యం చేస్తున్నాయి. ఇంకొన్ని కంపెనీలు ఉద్యోగులను తీసేయడంతో పాటు.. కొత్త నియామకాలను కూడా నిలిపివేస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -