- Advertisement -

పుష్కరాల విషయంలోనూ బాబు అబద్ధాలు చెబుతున్నారా?!

- Advertisement -

గోదావరి పుష్కరాలను ఒకరేంజ్ లో విజయవంతం చేశామని అంటున్నాడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ సారి పుష్కర నిర్వహణతో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ పేరు మార్మోగిందని..

ఏపీకి అంతర్జాతీయ స్థాయి ఖ్యాతి దక్కిందని ఆయన అంటున్నాడు.

ఈ విషయాన్ని ప్రకటించుకోవడానికి బాబు ఆదివారం రోజున రాజమండ్రిలోనే ప్రత్యేకంగా విజయోత్సవ సభనుకూడానిర్వహించారు. పుష్కర నిర్వహణలో తాము పూర్తిగా విజయంతం అయ్యామని ఈ సభలో గట్టిగా ప్రకటించుకొన్నారు.

మరి ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే.. పుష్కరాల్లో పుణ్య స్నానం చేసిన వారి విషయంలో ఏపీ ప్రభుత్వం ఒక లెక్కచెబుతోంది! ఈ పుష్కరాల్లో మొత్తం 4,86,80,362 మంది స్నానాలు చేశారని బాబు వివరిస్తున్నారు. పుష్కరాల్లో పిండ ప్రదానాలు నిర్వహించిన పురోహితులకే వంద కోట్ల రూపాయలు వచ్చాయని కూడా బాబు లెక్క చెప్పారు. అయితే ఈ లెక్కలు కొంత హాస్యాస్పదంగా ఉన్నాయి. అసలు పుష్కరాల్లో అంత మంది స్నానాలు చేసి ఉండే అవకాశంలేదని కొంతమంది అంటున్నారు.

ఎందుకంటే విభజిత ఆంధ్రప్రదేశ్ జనాభాను పిన్నాపెద్ద కలుపుకొని లెక్కేసినా అది ఐదుకోట్ల స్థాయిలో లేదు.ఇక పుష్కరాలకు వాళ్లంతా హాజరయ్యారనిఅనడానికిలేదు! ఇందులో ప్రధానంగా ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలసందడి కనిపిస్తుంది కానీ మిగతా వారి హడావుడి తక్కువే. ఇక ఇతర రాష్ట్రాల నుంచిపుష్కరాలకు జనాలు బాగానే వచ్చారని లెక్కలేసుకొన్నా.. మొత్తం ఫిగర్ ఐదుకోట్లకుచేరడం కష్టమేననని కొంతమంది లాజికల్ గా వివరిస్తున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం  నాలుగుకోట్లా ఎనభై తొమ్మంది లక్షల.. అంటూ నంబర్ నుచెబు తోంది. అయితే ఇదంతా గొప్పలుచెప్పుకోవడానికి చెబుతున్న లెక్క తప్ప మరోటి కాదని.. విమర్శకులు అంటున్నారు. మరి పవిత్ర పుష్కరాల గురించి ఎవరు అబద్ధాలు చెబుతున్నారో!

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -