Wednesday, May 15, 2024
- Advertisement -

ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదంటూ ప్రధాన న్యాయమూర్తి ఆవేదన

- Advertisement -

న్యాయదేవత కన్నీరు కార్చింది. దేశ ప్రధాని, అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు, న్యాయకోవిదులు ఒక్కచోటే ఉన్న వేళ భారత ప్రధాన న్యాయమూర్తి కంటతడిపెట్టారు. కేసులు, వివిధ అంశాల్లో వస్తున్న విమర్శలపై భారత ప్రధాన న్యాయమూర్తి సి.జెజఠాగూర్ కన్నీటి పర్యంతమయ్యారు. పెండింగ్ కేసులపై కోర్టులను నిందించరాదని, మొత్తం భారమంతా కోర్టులపైనే వేయరాదంటూ ఆయన గద్గదస్వరంతో అన్నారు. ఢిల్లీలో జరిగిన సమావేశంలో ప్రధాన న్యాయమూర్తి ప్రసంగించారు.

ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల హైకోర్టుల న్యాయమూర్తులు, ప్రధాన మంత్రి, న్యాయశాఖ మంత్రి వంటి మహామహులున్న చోట సుప్రీం కోర్టుచీఫ్ జస్టిస్ ఇలా భావోద్వేగానికి గురికావడం అందరిని కలచివేసింది. దాదాపు 40 నిమిషాల సేపు ప్రసంగించిన ఠాకూర్ భారత న్యాయవ్యవస్ధ భ్రష్టు పట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణమన్నారు. జడ్జీల నియామాకాల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని, జైళ్లలో మగ్గిపోతున్న ఖైదీలు, దేశాభివృద్ధి కుంటుపడడం వంటి అంశాలపై ప్రధాన న్యాయమూర్తి చలించిపోయారు.

ఏకధాటిగా మాట్లాడుతున్న ఆయన 20 నిమిషాల తర్వాత కంటనీరు కార్చారు. ఏ దేశ న్యాయ వ్యవస్థతో చూసినాఇక్కడి న్యాయమూర్తుల పనితీరు అద్భుతమని, ఇంతలా చేస్తున్నా న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులపైనే విమర్శలు వస్తుంటాయని బాధపడ్డారు. దేశంలో ప్రతి ఏటా కేసులు పెరిగిపోతున్నాయని, దానికి తగట్టుగా న్యాయమూర్తులు మాత్రం పెరగడం లేదని అన్నారు. దేశంలో పది లక్షల మంది జనాభాకు పది మంది న్యాయమూర్తులున్నారని, దీనిని 50 కి పెంచాలని సిఫార్సులు వచ్చినా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. ముఫ్ఫై ఏళ్ల క్రితం చేసిన సిఫార్సులు ఇంకా మూలన పడి ఉన్నాయన్నారు. ప్రవాస భారతీయులను పెట్టుబడులకు ఆహ్వానిస్తున్నాం కాని ఇక్కడి న్యాయవ్యవస్ధను మాత్రం పట్టించుకోవడం లేదని ప్రధాన న్యాయమూర్తి ఠాకూర్ వాపోయారు. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -