Tuesday, May 14, 2024
- Advertisement -

బెంగళూరు మేయర్ పీఠంపై ఒక తెలుగు వ్యక్తి.. అందులోనూ రెడ్డి!

- Advertisement -

బృహత్ బెంగళూరు మహానగర పాలిక.. మేయర్ గా ఎన్నికయ్యాడు మంజునాథరెడ్డి. శుక్రవారం జరిగిన మేయర్ ఎన్నికల్లో ఈ తెలుగు తేజం జయకేతనం ఎగరేసింది.

కాంగ్రెస్ పార్టీ తరపున మేయర్ అభ్యర్థిగా నిలబడిన ముంజునాథరెడ్డి కార్పొరేటర్ల ఓట్లతో మేయర్ స్థానాన్ని అధిష్టించాడు. ఈవిధంగా ఒక తెలుగు నేఫథ్యం ఉన్న వ్యక్తి.. ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రముఖ సామాజికవర్గం అయిన ‘రెడ్డి’ సంబంధీకుడు బెంగళూరు మేయర్ గా ఎన్నికవ్వడం నిజంగా ఆసక్తికరమైన అంశమే. అత్యంత నాటకీయ పరిస్థితుల మధ్య మంజునాథ రెడ్డి బెంగళూరు మేయర్ గా ఎన్నికయ్యాడు.

కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల రోజున పూర్తిగా భారతీయ జనతా పార్టీ అధిపత్యం కనిపించింది. తాము గెలిచేశామని బీజేపీ వాళ్లు సంబరాలు చేసుకొన్నారు. అయితే మేయర్ ఎన్నిక సమయానికి పరిస్థితి మారిపోయింది. కాంగ్రెస్ పార్టీ పూర్తి పై చేయి సాధించింది. మంజునాథ రెడ్డి మేయర్ గా ఎన్నికయ్యాడు. బెంగళూరులో తెలుగువాళ్ల సంఖ్య గురించి వేరే చెప్పనక్కర్లేదు. లెక్కపెడుతూ పోతే ఇది లక్షల సంఖ్యలో ఉంటుంది. ఈ ఐటి వ్యాలీలో ఈ మధ్యకాలంలోనే కాదు..ఆదినుంచి అనేక మంది తెలుగు వాళ్లు ఉన్నారు.

సెటిలర్లుగా భారీ స్థాయిలో ఆస్తులను కూడా కూడబెట్టారు తెలుగు వాళ్లు. అనంతపురం, కడప, చిత్తూరు నేపథ్యాలున్న అనేక మంది బెంగళూరుల్లో స్థిరనివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. వ్యవహారంలో కూడా తెలుగు బాగా వాడకంలో ఉంది ఈ నగరంలో. ఇలాంటి నేపథ్యంలో ఒక తెలుగు నేపథ్యం కలిగిన వ్యక్తి బెంగళూరు మేయర్ అయ్యాడు. కాబట్టి.. తెలుగు వాళ్లంతా ఆయనకు బెస్ట్ విషెష్ చెప్పవచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -