Thursday, May 16, 2024
- Advertisement -

అసెంబ్లీలో మళ్లీ బ్లూఫిల్మ్ ల గోల..!

- Advertisement -

ఆ మధ్య కర్ణాటక అసెంబ్లీలో కొంతమంది ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్ లు చూస్తూ అడ్డంగా బుక్కయ్యారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి.. అసెంబ్లీకి హాజరై..చర్చలు కొనసాగుతున్న సమయంలో వీళ్లు స్మార్ట్ ఫోన్లలో బ్లూ ఫిల్మ్ లను చూస్తూ చట్టసభను అవమానించారు.

వీరు వీడియోలను చూసి ఆస్వాధిస్తున్న దృశ్యాలు అసెంబ్లీ సమావేశాలను కవర్ చేసే కెమెరాల దృష్టిలో పడటంతో  వివాదం పెద్దదైంది. దానిపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. చివరకు ఆ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసి వివాదానికి ముగింపును ఇచ్చారు.

మరి అదే అనుకొంటే.. ఇప్పుడు మరో రాష్ట్ర అసెంబ్లీలోనూ ఇలాంటి రచ్చే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ సారి ఒరిస్సా అసెంబ్లీలో! ఇక్కడ ఒక ఎమ్మెల్యే బ్లూ ఫిల్మ్ వీడియోను చూస్తున్న దృశ్యం వీడియో పుటేజీలో రికార్డు అయ్యింది. దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీంతో ఆయనను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకొన్నారు.

అయితే ఆ ఎమ్మెల్యే మాత్రం బుకాయిస్తున్నాడు. తను బ్లూ ఫిల్మ్ వీడియోను చూడలేదని.. అది పొరపాటు ఓపెన్ అయ్యిందని ఆయన చెబుతున్నాడు. ఇంటర్నెట్ ను వాడిన మాట వాస్తవమేనని… యూట్యూబ్ బ్రౌజ్ చేస్తుండగా.. పొరపాటున ఒక వీడియోఓపెన్ అయ్యిందని.. ఆయన చెప్పుకొచ్చాడు. దాన్ని కావాలని తను ఓపెన్ చేయలేదని కవర్ చేసుకునే యత్నం చేశాడు! మరి ఎంత కవర్ చేసుకున్నా.. ఈఎమ్మెల్యేపై వారం రోజుల సప్పెన్షన్ వేటు అయితే పడింది!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -